రాష్ట్రీయం

మండే ఎండలకు ఎల్‌నినో కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 28 : ఎల్‌నినో ప్రభావంతోనే రాష్టవ్య్రాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అనంతపురం వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పనిచేస్తున్న వ్యవసాయ వాతావరణ శాస్తవ్రేత్త ఎస్‌ఎన్ మల్లీశ్వరి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు, ప్రస్తుత పరిస్థితి, ఈ పరిస్థితులు ఎంత కాలం కొనసాగుతాయి లాంటి అంశాలపై ఆమెతో ‘ఆంధ్రభూమి ప్రతినిధి’ మాట్లాడారు.
ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ..
రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు
నమోదవడానికి కారణాలేమిటి?
మల్లీశ్వరి: ఎల్‌నినో ప్రభావం ఒక కారణం కాగా రాష్టవ్య్రాప్తంగా మేఘాలు కానీ, తేమ వాతావరణం కానీ ఎక్కడా లేకపోవడం మరొక ప్రధాన కారణం. దీనివల్ల సూర్య కిరణాలు నేరుగా భూమి మీద పడడం వల్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ క్రమంలోనే మార్చి 18 నుంచి 23వ తేదీ వరకూ ఈ రకమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురవడం, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడం అన్నది తెలిసిందే. ఏటా మార్చి 21న ఈక్వినాక్స్(్భమధ్య రేఖమీదకు సూర్యుడు నిట్టనిలువుగా రావడం) ఏర్పడుతుంది. ఈ సంవత్సరం కూడా ఈక్వినాక్స్ ఏర్పడింది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం, ఈక్వినాక్స్ ఏర్పడడం అన్నవి రెండూ ఒకేసారి జరగడం వల్ల కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పవచ్చు. ఈ రెండు ఒకేమారు రావడం అన్నది అసాధారణమేమీ కాదు.
రెండు మూడు రోజులుగా వాతావరణంలో
చోటుచేసుకుంటున్న మార్పులకు కారణమేమిటి?
ఉత్తర కర్ణాటక, తెలంగాణ, కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఈ నెల 24వ తేదీ అనూహ్యంగా అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడింది. దీనివల్ల ఉపరితలంపైనే వేడిగాలులు వీస్తూ నలుదిశలకూ వ్యాపిస్తూ ఉండడం వల్ల రాయలసీమ, ఉత్తర కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల్లో వేడిగాలులతో కూడిన వాతావరణం ఏర్పడింది. అదే సందర్భంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నాలకు ఎదురుగా ఉన్న బంగాళాఖాతంలో ‘యాంటీ సైక్లోనిక్ ఏరియా’ ఏర్పడింది.
దానివల్ల సముద్రంలో నుంచి తేమతో కూడిన గాలులు బయటకు వీస్తున్నాయి. ఇలా ఉత్తర కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ఉపరితలం మీద ఏర్పడిన అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ వల్ల వేడిగాలులు బయటకు వీస్తుండగా, బంగాళాఖాతంలో ఏర్పడిన యాంటీ సైక్లోనిక్ ఏరియా ప్రభావం వల్ల తేమతో కూడిన గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావం వల్ల కోస్తాంధ్రలో కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఈ గాలులు చిత్తూరు జిల్లాలోని ఈస్ట్రన్ ప్రాంతం వరకూ వ్యాపించాయి. దీనివల్ల అక్కడ వరకూ వాతావరణంలో కొద్దిగా మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణంలో కొద్దిగా మార్పు వచ్చినట్లు కనిపించినా అది తాత్కాలికమే.
వర్షాలు కురిసే అవకాశాలు లేవంటారా?
ఉన్నాయి.. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ఏర్పడ్డ అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్, బంగాళాఖాతంలో ఏర్పడ్డ యాంటీ సైక్లోనిక్ ఏరియా కలిస్తే అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఇలా కురవడం వల్ల కూడా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయి.
ఈ పరిస్థితులు మరెన్ని రోజులు ఉండవచ్చు?
రాయలసీమలో ఏప్రిల్ 1 వరకూ ఇదే రకమైన పరిస్థితులు కొనసాగనున్నాయి. అప్పటి వరకూ ప్రతి రోజూ 40 నుంచీ 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఇక రాత్రి ఉష్ణోగ్రతలు సైతం 23 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదు కావచ్చు.