రాష్ట్రీయం

ఓటర్ల జాబితాపై దృష్టి పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: ‘ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి పెట్టండి. ఓట్లు కోల్పోయిన వారి పేర్లు మళ్లీ చేర్పించండి’ అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహించుకోవాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓట్లు గల్లంతు అయ్యాయని అనేక మంది ఆవేదన వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. దీంతో పార్టీ అభ్యర్థులకు రావాల్సిన మెజారిటీ రాలేదన్నారు. ఓటర్ల కార్డులు ఉన్నా, జాబితాలో పేర్లు లేవని వారు బాధ పడ్డారని కేటీఆర్ తెలిపారు. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకెళదామని ఆయన అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, మరో ఇద్దరు కార్యదర్శులు కలిసి ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఎన్నికల కమిషన్‌ను కలిసిన తర్వాత కమిషన్ చేపట్టబోయే ఓటర్ల నమోదు ప్రక్రియ గురించి పార్టీ శ్రేణులకు మార్గదర్శకాలను విడుదల చేద్దామన్నారు. ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఓటర్ల జాబితాల నుంచి పేర్లు గల్లంతైన వారిని చేర్చించాలన్నారు. అలాగే 18 ఏళ్ళు నిండిన యువతీ, యువకులను ఓటర్ల జాబితాలు చేర్పించి, వారు ఓటింగ్‌లో తప్పని సరిగా పాల్గొనేలా చూడాలన్నారు. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ఓటర్ల నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ఆయన సూచించారు. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా జరిగే సమావేశాలకు పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట కార్యదర్శులు తప్పని సరిగా హాజరుకావాలని, ఈ సమావేశాల్లో ప్రధానంగా ఓటర్ల జాబితాలపైనే దృష్టిపెట్టాలని కేటీఆర్ చెప్పారు.
సమావేశానంతరం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు ఓటర్ల జాబితాలను సవరించుకునే విషయంలో పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొనేలా చూడాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీంతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో టీఆర్‌ఎస్ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన అంశంపై కూడా చర్చించినట్లు ఆయన తెలిపారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఒక ప్రధాన కార్యదర్శికి బాధ్యత అప్పగించినట్లు ఆయన చెప్పారు. జనవరి మొదటి నుంచి జిల్లాల్లో పార్టీ కార్యాలయ నిర్మాణాలు ప్రారంభం కావాలన్న లక్ష్యంతో పని చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపిన తర్వాత నిర్మాణాలను చేపడతామని ఆయన తెలిపారు.