రాష్ట్రీయం

‘బాహుబలి’ బల్లే బల్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: తెలుగు చిత్ర రంగానికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ‘బాహుబలి’ చిత్రం జాతీయ స్థాయిలో రెండు అవార్డులను దక్కించుకోవడం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ప్రకటించిన 63వ జాతీయ అవార్డుల ఎంపిక సందర్భంగా బాహుబలి సినిమా జాతీయ ఉత్తమ చిత్రం, స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరిలో జాతీయ స్థాయిలో రెండు అవార్డులను దక్కించుకుని తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన గుర్తింపు తెచ్చింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కంచె నిలిచినందుకు అభినందలు తెలిపిన చిత్ర రంగప్రముఖులు.
* బాహుబలి అద్భుత విజయం సాధించి, జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. రాజవౌళి టీమ్‌కు నా అభినందనలు. తెలుగు సినిమా కీర్తి ప్రతిష్ఠలను పతాక స్థాయికి తీసుకు వెళ్లిన సినిమా ఇది.
- తలసాని శ్రీనివాసయాదవ్, తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి
* బాహుబలి జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం ఆనందంగా ఉంది. కానీ ఆ చిత్ర దర్శకుడు రాజవౌళి ఉత్తమ దర్శకుడిగా ఎంపిక కాకపోవడం కాస్త బాధనిపించింది.
- దాసరి నారాయణరావు, దర్శక నిర్మాత
* తెలుగు చిత్ర రంగ గతినే మార్చేసిన బాహుబలి విజయం సాధించడం వెనక రాజవౌళి కృషి ఎంతో ఉంది. ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన కంచె చిత్ర యూనిట్‌కు కూడా నా అభినందనలు.
- తమ్మారెడ్డి భరద్వాజ, దర్శక నిర్మాత
* తెలుగు చిత్ర రంగం విస్తరిస్తుందనడానికి బాహుబలి జాతీయ అవార్డు దక్కించుకోవడమే నిదర్శనం
- తనికెళ్ల భరణి, నటుడు
* బాహుబలి చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో బాహుబలికి అవార్డు లభించడం చాలా సంతోషంగా ఉంది. రాజవౌళి టీమ్‌కు నా అభినందనలు.
- శోభు యార్లగడ్డ, బాహుబలి చిత్ర నిర్మాత
* తెలుగు సినిమాకు లభించిన అపూర్వ విజయంగా భావిస్తున్నాను. కంచె సినిమాకు కూడా నా అభినందనలు
- జూనియర్ ఎన్టీఆర్, నటుడు
* తెలుగు చిత్ర రంగానికి బాహుబలికి అవార్డు దక్కడంతో కొత్త ఉత్సాహం ఇచ్చింది. చిత్ర యూనిట్‌కు నా అభినందనలు
- తమన్నా, నటి
‘బాహుబలి’పై నమ్మకం వమ్ము కాలేదు..
బహు భాషా చిత్రంగా విడుదలై దేశ, విదేశాల్లో విశేష ప్రజాదరణ చూరగొన్న ‘బాహుబలి’ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడంతో పాటు స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో మరో అవార్డుకు ఎంపిక కావడం పట్ల ఆ చిత్ర నటులు ప్రభాస్, రాణా దగ్గుబాటి, నిర్మాత యార్లగడ్డ శోబు, సాంకేతిక నిపుణులు హర్షాన్ని వ్యక్తం చేశారు. ‘బాహుబలి’పై తాము పెట్టుకున్న నమ్మకాన్ని ఈ అవార్డులు మరింత బలపరిచాయని వారు పేర్కొన్నారు. ‘జాతీయ ఉత్తమ చిత్రంగా బాహుబలికి గుర్తింపు లభించడం ఎనలేని సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ చిత్రంలో బాహుబలిగా ప్రధాన పాత్ర పోషించడం నా కెరీర్‌లోనే ఎంతో ప్రత్యేకమైన విషయం. నాపై నమ్మకంతో ఈ పాత్రలో నటించే అవకాశం కల్పించిన దర్శకుడు రాజవౌళికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా’ అని ప్రభాస్ పేర్కొన్నాడు. కాగా, అత్యంత వ్యయభరితమైన భారతీయ చిత్రంగా రికార్డులకు ఎక్కిన ‘బాహుబలి’ని ఎంతో కష్టపడి తెరకెక్కించడం జరిగిందని, ఇప్పుడు దీనికి జాతీయ ఉత్తమ చిత్రంగా గుర్తింపు లభించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషించిన రాణా దగ్గుబాటి తెలిపాడు. ‘బాహుబలి’ని ప్రేక్షకులు ఎంతో ఆరాధించారన్న విషయాన్ని బాక్సాఫీస్ ఫలితాలు గతంలోనే రుజువు చేశాయని, ఇప్పుడు దీనికి రెండు జాతీయ అవార్డులు లభించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని రాణా పేర్కొన్నాడు.
ప్రతిభకు పట్టం
న్యూఢిల్లీ: బాలీవుడ్‌కు చెందిన పెద్ద చిత్రాలకు ఈ ఏడాది జాతీయ అవార్డుల పంట పండటంతో వాటి నిర్మాతలు, నటీనటులు సంబరాల్లో మునిగిపోయారు. తమ ప్రతిభను గుర్తించి ఈ అవార్డులకు ఎంపిక చేయడం తమకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తోందని ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ, ‘బాహుబలి’ నటులు, నిర్మాతలు పేర్కొన్నారు. గత వారమే 29వ పడిలో ప్రవేశించిన తాను ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ చిత్రం ద్వారా జాతీయ ఉత్తమ నటి అవార్డుకు ఎంపికవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని, ఇది తనకు గొప్ప జన్మదిన కానుక అని కంగనా హర్షాన్ని వ్యక్తం చేసింది. ‘ఇప్పటివరకూ నేను అందుకున్న జన్మదిన కానుకల్లో ఇదే అత్యుత్తమమైనది. ప్రత్యేకించి జాతీయ ఉత్తమ నటుడు అమితాబ్ బచ్చన్‌తో కలసి నేను ఈ అవార్డుకు ఎంపికవడాన్ని పెద్ద ఆశీర్వాదంగా భావిస్తున్నా’ అని ఆమె ప్రకటనలో పేర్కొంది.
బన్సాలీ అవార్డు తల్లికి అంకితం
కాగా, ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడి అవార్డుకు ఎంపికైన సంజయ్ లీలా బన్సాలీ ఆ అవార్డును తన మాతృమూర్తికి అంకితమిచ్చాడు. తనకు జాతీయ అవార్డు రావాలని తన తల్లి ఎప్పుడూ దేవుడిని ప్రార్థించేదని, ఆమె ప్రార్థనలు ఫలించడంతో తాను తొలిసారి ఉత్తమ దర్శకుడి అవార్డుకు ఎంపిక కావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని బన్సాలీ అన్నాడు.