రాష్ట్రీయం

మిషన్ కాకతీయ రెండవ దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: మిషన్ కాకతీయ కార్యక్రమంలో రెండవ దశలో చేపట్టబోయే చెరువుల ప్రతిపాదనలను ఈ నెల 15వ తేదీకల్లా ప్రభుత్వానికి అందజేయాలని నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె జోషి ఆదేశించారు. అలాగే మిషన్ కాకతీయ మొదటి దశలో చేపట్టిన పనులను ఎట్టిపరిస్థితుల్లో మార్చి 2016 వరకు పూర్తి చేయాలని జోషి ఆదేశించారు. సచివాలయం నుంచి బుధవారం జిల్లాల నీటిపారుదలశాఖ అధికారులతో ఎస్‌కె జోషి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 15వ తేదీకల్లా రెండవ దశలో చేపట్టబోయే చెరువులపై 40 శాతం ప్రతిపాదనలు, ఈనెల 30వ తేదీకల్లా మిగిలిన 60 శాతం ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాలని ఎస్‌కె జోషి సూచించారు. ఈ ఫ్రతిపాదనల అంచనాలను ముందుగా చీఫ్ ఇంజనీర్ అనుమతి కోసం పంపించాల్సి ఉంటుందని ఆయన సూచించారు. మిషన్ కాకతీయ రెండవ దశలో చేపట్టబోయే చెరువుల ఎంపికకు నిర్వహించాల్సిన సర్వే, వాటిలో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలు, అంచనాలపై జిల్లాల అధికారులకు జోషి వివరించారు. చెరువుల ఎంపికకు నిర్వహించే సర్వేలో గ్రామ సభలు నిర్వహించి ప్రజాభిప్రాయం మేరకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. వివిధ జిల్లాల్లో ప్రాజెక్టుల వారీగా జరుగుతున్న భూసేకరణ పనుల పురోగతిని ముఖ్య కార్యదర్శి అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 1190 ఎకరాలను జీవో 123 ప్రకారం సేకరించినట్టు ఆ జిల్లా కలెక్టర్ జగన్మోహన్ తెలిపారు. మరో వారం రోజులలో 1050 ఎకరాలను సేకరించనున్నట్టు వివరించారు. ప్రధాన మంత్రి సంచాయి కిషన్ యోజన పథకం కింద చేపట్టడానికి నీటిపారుదల, ఉద్యానవనాలు, వ్యవసాయం, భూగర్భజలాలపై ప్రణాళికలను జిల్లాల వారిగా రూపొందించాలని ఎస్‌కె జోషి ఆదేశించారు. జిల్లాల్లో జరుగుతున్న మిషన్ కాకతీయ పనులు, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో కలెక్టర్లు, నీటిపారుదలశాఖ అధికారులు సమన్వయం చేసుకోని పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.

పారదర్శకంగానే దర్యాప్తు

ఓటుకు నోటు కేసుపై స్పష్టంచేసిన తెలంగాణ ఎసిబి డిజి ఏకె ఖాన్

హైదరాబాద్, డిసెంబర్ 2: ఓటుకు నోటు కేసులో పారదర్శకంగానే దర్యాప్తు కొనసాగుతుందని తెలంగాణ ఏసిబి డైరెక్టర్ జనరల్ ఏకె ఖాన్ వెల్లడించారు. బుధవారం జూబ్లిహిల్స్‌లో అవినీతి నిరోధక వారోత్సవాలకు సంబంధించి పలు కార్యక్రమాల పోస్టర్, కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏసిబి డిజి ఖాన్ మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో ఇద్దరు ఎమ్మెల్యేల స్వర పరీక్షల నివేదిక కోర్టుకు అందిందని, ఈ నివేదిక తమకు అందించేందుకు కోర్టు అనుమతి కోరామని చెప్పారు. దశల వారీగా ఓటుకు నోటు కేసు విచారణ కొనసాగుతుందని, ఫోరెన్సిక్ ల్యాబరేటరీ నివేదిక అందాక తదుపరి చర్యలు చేపడతామని ఖాన్ పేర్కొన్నారు. అదేవిధంగా కరీంనగర్ ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డి వడ్డీవ్యాపారం కేసులో సిఐడి నివేదిక రాగానే అధికారులపై చర్యలకు ఏసిబి సిద్ధంగా ఉందన్నారు. ఏసిబిలో సిబ్బంది కొరత ఉన్నా..నిజాయితీగల అధికారులతో నిక్కచ్చిగా వ్యవహరిస్తామని చెప్పారు. అవినీతి నిరోధక శాఖలో అవీనితి అధికారులకు స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 3వ,తేదీ నుంచి 9వ,తేదీ వరకు అవినీతి నిరోధక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఏసిబి డిజి ఖాన్ వెల్లడించారు. అవినీతిపై యువత, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రాష్టవ్య్రాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులకు వ్యాసరచన పోటీలతోపాటు కళాకారుల బృందాలతో అవగాహన కల్పిస్తామన్నారు.
‘అవినీతిని నిర్మూలిద్దాం..దేశాన్ని అభివృద్ధి చేద్దాం’ అనే నినాదంతో ముందుకెళ్తామని చెప్పారు. అవినీతిపై సమాచారాన్ని 1064కు ఫోన్ కాల్ చేయాలని డిజి ఖాన్ ప్రజలకు సూచించారు. అవినీతి నిరోధక వారోత్సవాలలో భాగంగా ఈ నెల 9న తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో అవినీతి నిరోధక అవగాహన ర్యాలీలు నిర్వహించి ఏసిబి కేసుల ఫిర్యాదుదారులను సన్మానించనున్నట్టు ఖాన్ వివరించారు. అవినీతి నిరోధక శాఖ అధికారుల నేర దర్యాప్తులో తమ నైపుణ్యం పెంచుకునేందుకు గానూ సైబర్ ఫోరెన్సిక్ శిక్షణ ఇప్పించడంతోపాటు నగరంలో సైబర్ సెల్ ప్రారంభించనున్నట్టు ఖాన్ పేర్కొన్నారు.

అవినీతి నిరోధక వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న
తెలంగాణ ఎసిబి డిజి ఏకె ఖాన్