రాష్ట్రీయం

అల్వాల్ వంతెనపైనుంచి కిందపడిన కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: అల్వాల్ వంతెనపై మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్‌ను ఢీకొట్టి వంతెనపైనుంచి కారు కిందపడిపోవడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఏడుగురు గాయపడ్డారు. చంపాపేటకు చెందిన కృష్ణమాచారి (65) తన కుటుంబ సభ్యులతో హకీంపేటలోని బంధువుల ఇంటికి ఓ శుభకార్యం నిమిత్తం సోమవారం సాయంత్రం వెళ్లారు. శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తిరుగు ప్రయాణంలో రాత్రి 2.30గంటల ప్రాంతంలో అల్వాల్‌లోని రైతు బజారు వద్దనున్న వంతెనపై బైక్‌ను ఢీకొట్టింది. దీంతో కారు అదుపు తప్పి వంతెన పైనుంచి కిందకు పడింది. ఈ ప్రమాదంలో కృష్ణమాచారి (65), ఆయన కుమార్తె కామిని (13) అక్కడిక్కడే మృతి చెందగా బైక్‌పై వస్తున్న విద్యార్థి శక్తిసింగ్ (21) తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో తొమ్మిది మంది ఉన్నట్టు సమాచారం. తీవ్ర గాయాలతో ఐదుగురు, స్వల్పంగా గాయపడిన ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.