ఆంధ్రప్రదేశ్‌

రాజకీయ అవినీతిపై పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 30: ప్రజాస్వామ్యాన్ని ఇటు అధికార తెలుగుదేశం పార్టీ అటు ప్రతిపక్ష వైకాపాలు ధనస్వామ్యంగా మార్చుతున్న ప్రస్తుత రోజుల్లో పార్టీ క్యాడర్‌ను కూడా కాపాడుకోవటం కష్టతరంగా మారుతుందనేది సిపిఐ పార్టీ కాస్తంత ఆలస్యమైనా గుర్తించింది. ఇటీవల కాలంలో సిపిఐ సీనియర్ నేతల నుంచి అనుబంధ ఏఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్, ముఖ్యనేతలు సైతం పార్టీని వీడుతున్న నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి వరకు నగరంలో జరిగిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశంలో మేథోమధనం జరిగింది. సిపిఐ గుంటూరు జిల్లా అధ్యక్షులు జంగాల అజయ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ విలేఖర్ల సమావేశంలో జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ, కంట్రోలు కమిషన్ జాతీయ చైర్మన్ ఈడ్పుగంటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కీలక సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు కె రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు బుధవారం నాడిక్కడ వెల్లడించారు. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో తెలంగాణాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పార్టీ ఫిరాయింపులను ఎండగట్టిన చంద్రబాబు నేడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పరిపాలనలో ఎంతో కీలకమైన పిఎసి చైర్మన్‌గా వ్యవహరించిన వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని ఆయన పదవీకాలం ముగిసిన వెంటనే తన పార్టీలోకి చేర్చుకున్నారు. తన తప్పిదాలను కప్పిపుచ్చుకోటానికి ఆ అవకాశం జ్యోతుల నెహ్రూకు రాలేదనే కారణంతోనే వెనువెంటనే చేర్చుకోవటం చూస్తేనే బాబు వైఖరి ఏమిటో ఇట్టే అర్థమవుతుందన్నారు. ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేస్తున్నవారు ఆ తర్వాత ఐదేళ్ల కాలంలో అడ్డుగోలుగా సంపాదించడమే గాక పార్టీ ఫిరాయింపులకు సైతం వెనుకాడటం లేదన్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు ఓ వైపు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందంటారు. చట్ట ప్రకారం రావాల్సిన బడ్జెట్‌లోటు, రాజధాని నిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కనీసం ఈ ఏడాది రూ. 24,468 కోట్లు కావాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ఈ ఏడాది అన్ని కల్పి రూ.900 కోట్లు మించి అందించే పరిస్థితి కన్పించడం లేదన్నారు. వెనుకబడిన జిల్లా అభివృద్ధికి రూ. 1400 కోట్లు అడిగితే రూ.14 రూపాయలు కూడా దక్కే పరిస్థితి కన్పించడం లేదంటూ చంద్రబాబు కేంద్రంతో ఏ విధంగా లాలూచీ పడుతున్నారో గుర్తించాలన్నారు. ఏప్రిల్‌లో జిల్లాల్లో సభలు సమావేశాలు, మే 9, 10, 11న రాష్ట్ర స్థాయి విస్తృత కౌన్సిల్ సమావేశం జరుపనున్నామన్నారు. దీనికి జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరపు సుధాకరరెడ్డి, జాతీయ కార్యదర్శి నారాయణ తదితరులు హాజరుకానున్నారని తెలిపారు.