రాష్ట్రీయం

నిన్నటి ప్రశ్నలే ప్రత్యక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 10: ఐఐటీ జేఈఈ మెయిన్ గురువారం నాటి ఆన్‌లైన్ పరీక్షలో పలువురికి బుధవారం నాడు వచ్చిన ప్రశ్నలో తిరిగి ప్రత్యక్షమయ్యాయి. మొత్తం మీద చూస్తే ఆన్‌లైన్ పరీక్ష మూడో రోజు చాలా ప్రశాంతంగా జరిగిందని విశే్లషకులు చెబుతున్నారు. ఫిజిక్స్‌లో కొన్ని ప్రశ్నలు కొంచెం కఠినంగా వచ్చాయని గ్రేడప్ ఉపాధ్యక్షుడు నవీన్ సీ జోషి పేర్కొన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు పేపర్-1 ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా అంతా ఊహించినట్టే వచ్చిందని ఆయన చెప్పారు. కెమిస్ట్రీ, మాథ్స్ సాధారణంగానే ఉన్నాయని, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుండి ఎక్కువగా ప్రశ్నలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఇంత వరకూ జరిగిన మూడు స్లాట్‌లలో చూస్తే కటాఫ్ 80 నుండి 85 మార్కుల వరకూ ఉండొచ్చని అంచనా వేస్తున్నట్టు జోషి చెప్పారు.