రాష్ట్రీయం

రైల్వే టిక్కెట్ల తనిఖీకి హ్యాండ్ హెల్డ్ సిస్టమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 10: రైల్వేలో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కదిలే రైలులో బెర్తుల ఖాళీలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి కొత్త పరికరాన్ని తీసుకువచ్చారు. ఈనెల 10వ తేదీ నుంచి పరికరంతో ప్రయాణికులకు ఖాళీల బెర్తుల సమచారం చెప్పడానికి హ్యాండ్ హెల్డ్ టర్మినల్ సిస్టమ్‌ను రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త విధానంతో మూడు మార్గాల్లో నడిచే రైళ్లలో అమలు చేయనున్నట్లు సికింద్రాబాద్ రైల్వే జనరల్ మేనేజర్ అమిత్‌వరదాన్ చెప్పారు. దక్షిణ మధ్య రైల్వేలో 40 సిస్టమ్‌లను వినియోగిస్తున్నట్లు తెలిపారు. కొత్త హ్యాండ్ హెల్డ్ టెర్మినల్‌ను నాలుగు మార్గాల్లో ప్రయాణిచే రైళ్లలో అమలు చేస్తామన్నారు. హ్యాండ్ హల్డ్ టర్మినల్‌తో వివిధ రకాల ఉపయోగాలను వివరించారు. ఖాళీ బెర్తుల వివరాలను తెలుసుకోవచ్చు. సికింద్రాబాద్- పూణె (12025-12026), హజరత్ నిజాముద్దీన్- సికింద్రాబాద్ (12437-12438), హజరత్- నిజాముద్దీన్ చెన్నై (12433-12334), బెంగళూరు- హజరత్ నిజాముద్దీన్ (22691-22692) రైళ్లలో కొత్త టెక్నాలజీ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు.

చిత్రం..హ్యాండ్ హెల్డ్ టర్మినల్ పరికరాన్ని రైల్వే సిబ్బందికి ఇస్తున్న
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అమిత్ వరదాన్