రాష్ట్రీయం

నీట్ అప్లికేషన్ విండో ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీల్లో యూజీ కోర్సులో అడ్మిషన్లకు నిర్వహించే నీట్- 2019 యూజీ పరీక్ష దరఖాస్తు విండోను నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ ప్రారంభించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని తమ వివరాల్లో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే వాటిని సరిచేసుకునేందుకు కరక్షన్ విండోను ప్రారంభించింది. జనవరి 31వ తేదీలోగా తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ పేర్కొంది. నీట్ పోర్టల్‌లోకి లాగిన్ అయి ఫోటోతో పాటు సంతకం, పరీక్ష లాంగ్వేజీ, ఎక్కడ పరీక్ష రాయాలి వంటి వివరాలను కూడా మార్చుకునే వీలుకల్పించారు. మార్పులు చేసినపుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఒకసారి కరక్షన్ విండో క్లోజ్ చేస్తే మళ్లీ మార్పులకు ఛాన్సు ఉండబోదని పేర్కొన్నారు. నీట్ పరీక్ష హాల్‌టిక్కెట్లు ఏప్రిల్ 15 నుండి అందుబాటులో ఉండనున్నాయి. పరీక్షను మే 5న నిర్వహిస్తారు. ఫలితాలను జూన్ 5న ప్రకటిస్తారు. కరెక్షన్ కోసం ఎన్‌టీఏ నీట్ డాట్ ఎన్‌ఐసీ డాట్ ఇన్ అనే వెబ్ పోర్టల్‌ను దర్శించాలని అధికారులు పేర్కొన్నారు.