రాష్ట్రీయం

జేఈఈ మెయిన్ ప్రాథమిక కీ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 14: ఐఐటీ జేఈఈ మెయిన్ పరీక్ష ప్రాథమిక కీని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ సోమవారం నాడు విడుదల చేసింది. వాస్తవానికి 16వ తేదీన కీ విడుదల చేస్తారని తొలుత భావించినా, రెండు రోజుల ముందే తొలి కీని టెస్టింగ్ ఏజన్సీ విడుదల చేసింది. ఈసారి సీబీటీకి 9.41,117 మంది రిజిస్టర్ చేసుకున్నారు. తొలి కీని జేఈఈమెయిన్ డాట్ ఎన్‌ఐసీ డాట్ ఇన్ అనే వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసినట్టు టెస్టింగ్ ఏజన్సీ పేర్కొంది. దీనిపై ఈ నెల 17వ తేదీ సాయంత్రం వరకూ అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం నిపుణుల కమిటీ వాటిని అధ్యయనం చేసి తుది కీని ఖరారు చేస్తుంది. అనంతరం తుది కీ ప్రాతిపదికగా ఫలితాలను సిద్ధం చేస్తారు. వెబ్ పోర్టల్‌లో లాగిన్ క్లిక్‌ను లింక్ ద్వారా కీ వివరాలు పొందవచ్చని అధికారులు తెలిపారు. తుది ఫలితాలను ఈ నెల 31వ తేదీ లోగా ప్రకటించే వీలుందని అధికారులు చెబుతున్నారు.