రాష్ట్రీయం

రైతుబంధు పథకం భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ ప్రభుత్వం రైతాంగం కోసం చేపట్టిన రైతుబంధు పథకం రైతుకు భరోసా ఇచ్చే విధంగా ఉందని ప్రముఖ గాంధేయవాది, సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ప్రశంసల వర్షం కురిపించారు. శనివారం హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సులో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం పట్ల ఆయన అభినందించారు. రైతుబంధు పథకం రైతుల పాలిట ఆశాదీపం అని కొనియాడారు. రైతులకు ఇలాంటి పథకాలు అవసరమని, దేశంలో ప్రతి రాష్ట్రంలో ఇలాంటి పథకాలు రావాలని ఆకాంక్షించారు. కేంద్రం కూడా దీనిపై ఆలోచన చేయాలని హజారే సూచించారు. సమర్థ నాయకత్వం ఉన్నప్పుడే రైతులకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. కేంద్రానికి వ్యాపారులపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని ఆయన విమర్శించారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కేంద్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులే అమలు చేస్తున్నామని కేంద్రం అబద్ధాలు చెబుతోందని ఆయన విరుచుకుపడ్డారు. వ్యవసాయ అభివృద్ధి సాగునీటి ప్రణాళిక, పంటల ప్రణాళిక, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని అప్పుడే రైతు బాగుపడతాడని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులను పట్టించేకునే పరిస్థితుల్లో లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
లోక్‌పాల్, లోకాయుక్తపై మరోసారి ఉద్యమం
లోక్‌పాల్, లోకాయుక్తను చట్టరూపంలోకి తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని ప్రముఖ గాంధేయవాది, సామాజికవేత్త అన్నాహ జారే ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసగా ఈనెల 30వ తేదీ నుంచి తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత నేతృత్వంలో జరుగుతున్న సదస్సులో పాల్గొనడానకి హైదనాబాద్ వచ్చానని చెప్పారు. 2013లో లోక్‌పాల్, లోకాయుక్త చట్టాల అంశాలు ప్రతిపాదనకు వచ్చాయన్నారు. ఆనాడు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే లోక్‌పాల్, లోకాయుక్తలకు చట్టబద్ధత కల్పిస్తానని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ హామీ ఇచ్చారని హజారే గుర్తుచేశారు. అదే ఏడాది మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, దీంతో లోక్‌పాల్, లోకాయుక్తపై ముందడుగు పడుతుందని ఆశించానని ఆయన అన్నారు. తీరా నాలుగున్నరేళ్లు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టే ఉందని హజారే విమర్శించారు. అందుకే మరోసారి ఉద్యమం తప్పదన్నా రు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సుకు ఆయన హాజరయ్యారు.

చిత్రం..అన్నా హజారే