రాష్ట్రీయం

కొవ్వాడ అణుపార్క్‌కు మార్గం సుగమం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 31: శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో నిర్మించతలపెట్టిన అణుపార్క్‌కు మార్గం సుగమమైంది. భారత్ - అమెరికాల ఆధ్వర్యంలో కొవ్వాడలో ఆరు వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించనున్న అణుపార్కు నిర్మాణానికి సన్నాహాలూ తుది దశకు చేరుకున్నాయి. భూ సేకరణ నిమిత్తం కేంద్ర అణుఇంధన సంస్థ గురువారం రూ.390 కోట్లు విడుదల చేసింది. ఆ మొత్తం జిల్లా కలెక్టర్ ఖాతాకు జమ అయినట్లు అణువిద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజినీర్ జి.వెంకటరమేష్ చెప్పారు. దీంతో భూ సేకరణ పనులు ఊపందుకోనున్నాయి. కొవ్వాడలో అణువిద్యుత్ పార్కు ఏర్పాటు చేస్తామని కేంద్రప్రభుత్వం 25 ఏళ్లక్రితం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అత్యంత కీలకమైన భూసేకరణ పనులకు నిధులు విడుదలకాకపోవడంతోనే జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో అణు ఇందన సంస్థ తాజాగా భూసేకరణకు సంబంధించి రూ.390 కోట్ల నిధులను విడుదల చేసింది. కొవ్వాడలో లక్ష కోట్లతో నిర్మించనున్న అణువిద్యుత్ పార్కుకు సుమారు 2,500 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారు. అత్యంత కీలకమైన భద్రత సహా ఏయే గ్రామాలు ఖాళీ చేయాలి, అణుకేంద్ర రక్షణ పరిధిలోకి ఏయే గ్రామాలొస్తాయి, ఎంత భూమి అవసరం తదితర వివరాలను సమగ్రంగా అత్యున్నతస్థాయిలో ఇప్పటికే విశే్లషించారు.
ఉపగ్రహ ఛాయాచిత్రాల సహాయంతో అక్షాంశ రేఖాంశాలు ఆధారంగా అతి సూక్ష్మస్థాయిలో అధ్యయనం చేశారు. అణు రియాక్టర్లు ఎక్కడ ఏర్పాటు చేసేదీ గుర్తించారు. మరోవైపు భారత నావికాదళానికి చెందిన అధికారులు, సైనికులు వివిధ కోణాల్లో కొవ్వాడ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. పార్కుకోసం కొవ్వాడ, చిన్న కొవ్వాడ, రామచంద్రాపురం, గూడెం, టెక్కలి, గ్రామాలను ఖాళీ చేయించాల్సి ఉంది. పునరావాసానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన ఎన్‌జిఆర్‌పురం పంచాయతీ పరిధిలో జీరుపాలెం, కొత్తముక్కాంలో భూములు రెవెన్యూ పరిశీలనలో ఉన్నాయి.
కొవ్వాడ ప్రజలు ఎక్కడ కోరుకుంటే అక్కడే కాలనీలు నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు. పార్కు నిర్మాణానికి సంబంధించి తొలగించాల్సిన గ్రామాల్ని రెవెన్యూశాఖ గుర్తించింది. రామచంద్రాపురం, పెద్దకొవ్వాడ (ఒకే రెవెన్యూ గ్రామం)లో 515 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. అక్కడ నుంచి 1885 జనాభాను తరలించేందుకు సర్కారు చర్యలు తీసుకోవల్సివుంది. వీరంతా మత్స్యకారులు. చేపలవేటే వీరి ప్రధాన వృత్తి. వీరికి చెందిన 302.35 ఎకరాల భూమిని ప్రభుత్వం సమీకరించాల్సివుంది. అలాగే, చిన కొవ్వాడ, టెక్కలి (ఒకే రెవెన్యూగ్రామం)లో 347 కుటుంబాలకు చెందిన 1,619 మందికి పునరావాసం కల్పించాల్సి ఉంది. వారి నుంచి 116.84 ఎకరాలు అణుపార్కు కోసం సేకరించాల్సి ఉంది. గూడెం గ్రామాన్ని సైతం తొలగించాల్సివున్నప్పటికీ, అక్కడ నివాసితులు లేకపోవడంతో కేవలం 141.10 ఎకరాల భూమి సేకరించి పరిహారం చెల్లించాల్సివుంది. వీటితోపాటు కోటపాలెం, అల్లివలస, జీరుకొవ్వాడ గ్రామాలను ప్రాజెక్టు ప్రభావిత గ్రామాలుగా గుర్తించడడంతో అక్కడి నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సి వుంటుంది.