రాష్ట్రీయం

పాఠశాలలో బ్యాలెట్ పత్రాలు ప్రత్యక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోతె: మండల పరిధిలోని హుస్సేనాబాద్ ప్రాథమిక ఉన్నత పాఠశాల్లో నిన్న జరిగిన పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పత్రాలు బయట పడిన సంఘటన కలకలం రేపింది. పోలీసులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సోమవారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇంతలోనే మంగళవారం ఉదయం బ్యాలెట్ పత్రాలు పాఠశాల ఆవరణలో కనబడటంతో స్థానికంగా కలకలం రేపింది. పాఠశాల సమయానికి వచ్చిన ఉపాధ్యాయులు స్వీపర్‌తో గదులను శుభ్రం చేయించి వారి పనిలో నిమగ్నమయ్యారు. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాఠశాల పక్కనే ఉన్న వ్యవసాయ కూలీలను పిలవడానికి వచ్చి వెళ్తుండగా పాఠశాల బయటి ఆవరణలో బ్యాలెట్ పత్రాలు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి వాటిని తీసుకుని టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి ఇంటికి వెళ్లి ఇచ్చారు. దీంతో వారు వాటిని పార్టీ నాయకుల సాయంతో ఎన్నికల లెక్కింపులో తమకు అన్యాయం జరిగిందని భావించి స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ వద్దకు తీసుకెళ్తామని చెప్పారు. ఇంతలోనే సోమవారం ముగిసిన ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి ఊరేగింపుగా రావడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. దీంతో స్థానిక ఎస్‌ఐ సంతోష్‌కుమార్ బందోబస్తులో వెళ్లి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ విషయంలో అధికారులకు తెలపడంతో హుటాహుటిన సూర్యాపేట ఆర్డీవో మోహన్‌రావు తన సిబ్బందితో పాఠశాలకు చేరుకున్నారు. పాఠశాల ఆవరణను పరిశీలించి స్వీపర్, ఉపాధ్యాయులను సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో విచారించి వారిని అడిగి తెలుసుకున్నారు. బ్యాలెట్ పత్రాల కోసం సీఐ పోలీసుల సాయంతో ఆ వ్యక్తిని తీసుకురాగానే అతని దగ్గర ఉన్న బ్యాలెట్ పత్రాలను తీసుకుని విచారించారు. ఈసందర్భంగా 73 సర్పంచ్ బ్యాలెట్ పత్రాలు తీసుకుని స్టేజీ-2 అధికారి సమక్షంలో విచారించగా అవి 22 పోలింగ్ స్టేషన్‌కు సంబంధించినవే నని తేలడంతో వాటిని గుర్తుల వారీగా లెక్కించారు. వీటిలో నోటాకు 21, బ్యాట్ గుర్తుకు 42, కత్తెరకు 5, విమానం గుర్తుకు 2, కప్పు సాసర్ గుర్తుకు 3గా విభజించి వాటిని భద్రపరిచారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ పోలింగ్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే అవి లెక్కించిన బ్యాలెట్ పత్రాలే అక్కడ పడిపోవడంతో ఈ సంఘటన జరిగిందన్నారు.
దీనికి బాధ్యులైన స్టేజీ-2 అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే బ్యాలెట్ పత్రాలు బయటకు తీసుకెళ్లిన వ్యక్తులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నివేదికను కలెక్టర్ అందజేస్తామని వారు తెలిపారు. ఈ విచారణలో తహశీల్దార్ సరస్వతి, ఎంపీడీవో శివశంకర్, డీఆర్వో రాజారావు, ఎస్‌ఐ సంతోష్‌కుమార్, సూపరింటెండెంట్ వెంకటాచారి, రెవెన్యూ, పోలీసు సిబ్బంది, ఉపాధ్యాయులతోపాటు టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి కట్కూరి ఉష తదితరులు పాల్గొన్నారు.

చిత్రాలు.. హుస్సేనాబాద్‌లో విచారణ జరపుతున్న సూర్యాపేట ఆర్డీవో మోహన్‌రావు...
*లభ్యమైన బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తున్న అధికారులు