రాష్ట్రీయం

అనాథను అక్కున చేర్చుకున్న అమెరికా దంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, జనవరి 22: జన్మనిచ్చిన తల్లి కర్కశంగా వదిలేసి వెళ్లిపోయిన ఆడ బిడ్డను అమెరికాకు చెందిన దంపతులు అక్కున చేర్చుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా 19 నెలల వయస్సున్న ఆ బిడ్డను అమెరికాకు చెందిన జాషువా ఓబోల్జ్, ఎమి ఓబోల్జ్ దంపతులకు అప్పగించారు. అలాగే మరో అనాథ బిడ్డను చెన్నైకు చెందిన దంపతులకు అప్పగించారు. వివరాలిలావున్నాయి... కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో 2017, జూన్ 12వ తేదీన ఒక మహిళ తనకు జన్మించిన ఆడ శిశువును విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఆ శిశువును చైల్ట్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో కాకినాడలోని శిశు గృహం సంరక్షణలో ఉంచారు. జన్మనిచ్చిన వారు తీసుకెళ్లాలని అధికారుల ప్రకటించినప్పటకీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆ బాలికకు అరుణ అనే పేరుపెట్టారు. అరుణను దత్తత ఇస్తామంటూ అధికారులు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. దీనిని చూసిన అమెరికా గ్రాండ్ ఫోర్క్స్ ఏఎఫ్‌బీ నార్త్ డకోటాకు చెందిన జాషువా ఎబోల్జ్, ఎమి ఎబోల్జ్ దంపతులు బాలికను దత్తత తీసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. దంపతుల వివరాలను పరిశీలించిన అధికారులు ఈ అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లగా దత్తత ఇచ్చేందుకు అంగీకరిస్తు ఉత్తర్వులను జారీఅయ్యాయి. ప్రస్తుతం 19 నెలల వయసున్న అరుణను మంగళవారం ఓబోల్జ్ దంపతులకు కలెక్టర్ కార్తికేయ మిశ్రా అప్పగించారు. అరుణను చేతుల్లోకి తీసుకున్న ఎమి ఓబోల్జ్ ఆనందానికి అవధుల్లేవు.
అదే విధంగా గత ఏడాది సెప్టెంబర్ 30న ముమ్మిడివరంలోని ప్రకాష్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న విష్ణాలయంలో 15రోజుల వయస్సు ఉన్న ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈ శిశువును కూడ అధికారులు కాకినాడ శిశు గృహానికి తరలించి సంజన అని నామకరణం చేశారు. శిశువుకు సంబంధించి రక్తసంబధీకుల కోసం అధికారులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాంతో సంజనను దత్తత ఇస్తామని అధికారులు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. చెన్నై నగరానికి చెందిన జి నటరాజు, విష్ణుప్రియ దంపతులు సంజనను దత్తత తీసుకుంటామని దరఖాస్తు చేసుకున్నారు. చట్టపరమైన అంశాలు పూర్తి కావడంతో కలెక్టర్ కార్తికేయ మిశ్రా శిశువు సంజనను విష్ణుప్రియ దంపతులకు అందజేశారు. బిడ్డలను దత్తత తీసుకున్న దంపతులను కలెక్టర్ మిశ్రా ప్రత్యేకంగా అభినందించారు. వారి సంరక్షణలో చిన్నారులు ఇద్దరికీ మంచి భవిష్యత్ ఏర్పడాలని ఆకాంక్షించారు. జాషువా ఓబోల్జ్, ఎమి ఓబోల్జ్ దంపతులు, నటరాజు, విష్ణుప్రియ దంపతులు చిన్నారులను తమకు దత్తత ఇచ్చినందుకు కలెక్టర్‌కు, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన దత్తత కార్యక్రమంలో జేసి-2 సిహెచ్ సత్తిబాబు, ఐసీడీఎస్ పీడీ సుఖజీవన్‌బాబు, ఏపీడీ పి మణెమ్మ, చైల్డ్ వెల్ఫేర్ అఫీసర్ సిహెచ్ వెంకట్రావు పాల్గొన్నారు.
చిత్రం..అమెరికాకు చెందిన జాషువా ఓబోల్జ్, ఎమి ఓబోల్జ్ దంపతులకు
బాలికను అందిస్తున్న తూ.గో. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా