రాష్ట్రీయం

తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: రాష్ట్ర అసెంబ్లీ, మండలి బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. గురువారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ముగిసిన తర్వాత స్పీకర్ మధుసూదనాచారి సభను నిరవధికంగా వాయిదా వేశారు. కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ కూడా సభను నిరవధికంగా వాయిదా వేశారు. 17 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 89 గంటల 42 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశాల్లో 4 నక్షత్రగుర్తు గల ప్రశ్నలకు, 29 ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. 12 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.
వివిధ పార్టీల బలబలాలు
టిఆర్‌ఎస్-78, కాంగ్రెస్-19, మజ్లిస్-7, బిజెపి-5, టిడిపి-3, వైకాపా-3, సిపిఐ-1, సిపిఎం-1, ఇండిపెండెంట్-1, నామినేటెడ్-1. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మరణంతో ఒక స్థానం ఖాళీగా ఉంది.