రాష్ట్రీయం

రైతు ఆత్మహత్యల వివరాలివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.్భసలే, జస్టిస్ పి.నవీన్‌రావుతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసుపై విచారణ నిర్వహించింది. పంట నష్టం కారణంగా పంట రుణాలను ప్రభుత్వాలకు తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతుల వివరాలను సమర్పించాలని పిటీషనర్లను అడిగింది. వ్యవసాయ జనచైతన్య సమితి, పాకాల శ్రీహరిరావు, ప్రొఫెసర్ కోదండరామ్ తదితరులు విడివిడిగా దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు రైతుల ఆత్మహత్యల వివరాలను అందించాలని కోరింది. అలాగే తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్‌ను కూడా ప్రభుత్వం అందించే ప్రయోజనాలు అందక రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వివరాలను సమర్పించాలని ఆదేశించింది. ఒక పిటీషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ రెండు ప్రభుత్వాలు రాష్ట్ర స్థాయి రైతు కమిషన్‌ను ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయని తెలిపారు. బాధిత రైతాంగానికి తగిన న్యాయం చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నామని బెంచ్ తెలియజేస్తూ, అలాగే ప్రభుత్వాలు కూడా ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాయని తెలిపింది. కలెక్టర్లు తగిన నివేదికలను తయారు చేస్తున్నందున తమకు కొంత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది శరత్ కోరడంతో ఈ కేసు విచారణను మరో రెండు వారాలకు వాయిదా వేసింది.

మరో ఇద్దరు
రైతుల ఆత్మహత్య
మల్దకల్, చేగుంట, మార్చి 31: మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో అప్పుల బాధతో మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మల్దకల్ మండలం మద్దెలబండ గ్రామానికి చెందిన రైతు కుర్వ ఆంజనేయులు (37) ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకొన్నాడు. మెదక్ జిల్లా చేగుంట మండలం వల్లూర్ గ్రామానికి చెందిన పల్లిబాగి బాల్‌రాజ్ (30) అనే రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.