రాష్ట్రీయం

జగన్‌కు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టుకు ప్రతిపక్ష నేతజగన్మోహన్ రెడ్డి హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఈ ఏడాది జూన్ నెలాఖరు వరకు అమలులో ఉంటాయి. హైకోర్టు జడ్జి జస్టిస్ రాజా ఎలాంగో ఈ ఆదేశాలను జారీ చేశారు. ఈ కేసులో ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ కేసుల్లో సిబిఐ ఇంతవరకు 11 చార్జిషీట్లను జగన్‌పై దాఖలు చేసింది. తాను ఒక రాజకీయపార్టీ అధ్యక్షుడు అయినందువల్ల, ప్రజాప్రతినిధిగా ఉన్నందువల్ల ప్రజలను కలుసుకోవాల్సి ఉందని, అందుకే శుక్రవారం కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ హైకోర్టును అభ్యర్ధించారు. అనంతరం ఈ కేసు విచారణను జూలై 1వ తేదీ వరకు హైకోర్టు వాయిదా వేసింది. ఇదే మినహాయింపును పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాప్‌రెడ్డి, దాల్మియా సిమెంట్ అధినేత పునీత్ దాల్మియాకు కూడా వర్తింప చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఐఆర్‌డిఏ చైర్మన్‌కు సమన్లు
హైదరాబాద్, మార్చి 31: ఎస్సీ, ఎస్టీ అత్యాచారాలు, దౌర్జన్యాల నిరోధక చట్టం కేసులో ఐఆర్‌డిఏ చైర్మన్ టిఎస్ విజయన్‌తో పాటు మరో ఏడుగురు ఉన్నతాధికారులు కోర్టుకు హాజరుకావాలంటూ నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ కంపెనీ చైర్మన్ వి సుధాకర్ అనే వ్యక్తి తనను కులం పేరుతో వేధిస్తున్నారంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను గతంలో బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, కాని కేసును మూసివేశారని, కాని తన వద్ద తనను వేధించారనేందుకు ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఏప్రిల్ 28వ తేదీన కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఐఆర్‌డిఏ చైర్మన్ విజయన్ తదితరులను ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది.