రాష్ట్రీయం

రోడ్డు దునే్నశారు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

33వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారన్నది చంద్రబాబు మాట. లబ్ది కల్పిస్తామన్న ప్రభుత్వం పని అయన తరువాత సవాలక్ష ఆంక్షలు పెడుతుందన్నది రైతుల వాదన. మేం అసలు భూములే ఇవ్వలేదన్నది ఇంకొందరి వాదన. మొత్తానికి అమరావతి శంకుస్థాపన కోసం నిర్మించిన రోడ్డును రైతులు దునే్నశారు. మా భూముల్లో మేం పంటలు వేసుకుంటున్నామంటూ సాగుకు ఉపక్రమించారు. మొత్తానికి వ్యవహారం గందరగోళంగా మారింది.

---

విజయవాడ, ఏప్రిల్ 1: రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా 33వేల ఎకరాల భూమి ఇచ్చారని సిఎం చంద్రబాబు చెపుతున్నారు. ఏడాదికి మూడు పంటలు పండే భూములు పోయినా, రాజధాని వస్తున్నందువలన తమ జీవితాలు బాగుపడతాయని రైతులు భావించారు. చాలాచోట్ల రైతులు మూకుమ్మడిగా వచ్చి భూములను ప్రభుత్వానికి అప్పగించారు. భూములు ఇవ్వడానికి కొంతమంది ఇష్టపడకపోయినా, విధిలేని పరిస్థితుల్లో విలువైన భూమిని ప్రభుత్వానికి ముట్టచెప్పుకోవలసి వచ్చింది. భూ సమీకరణ సునాయాసంగా జరిగిపోడానికి ప్రభుత్వం రైతులకు అనేక హామీలు ఇచ్చింది. భూ సమీకరణ కాస్తా పూర్తయిన తరువాత ఆయా హామీలను నెరవేర్చేందుకు అర్థంపర్థం లేని షరతులు విధిస్తూ వస్తోంది. దీంతో కొంత మంది రైతులు కోర్టుకెక్కడానికి ప్రయత్నిస్తున్నారు. మరికొంతమంది రైతులు రాజధాని నిర్మాణం కోసం శంకుస్థాపనకు ప్రధాన మంత్రి తదితరులు హాజరవుతున్నారని, రాజధానికి భూములు ఇచ్చిన, ఇవ్వని రైతుల పొలాల నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల మేర శాశ్వత రోడ్డును ప్రభుత్వం నిర్మించింది. ఎవరైతే భూములు ఇవ్వని రైతులు ఉన్నారో, వారు ఆ రోడ్డును తవ్వేసి యథావిథిగా పంటలు వేసుకుంటున్నారు. మెట్ట ప్రాంత రైతులకు ఒక ఎకరాపై కనీసం లక్ష రూపాయల ఆదాయం వస్తోంది. జరీబు భూములపై ఒక్కో పంటకు మూడు నుంచి ఐదు లక్షల రూపాయల ఆదాయం లభిస్తోంది. దీంతో భూములు ఇచ్చిన రైతుల్లో ఆందోళన మొదలైంది. తమ భూములను తీసుకుని నామ మాత్రంగా కౌలు చెల్లిస్తున్నారు. తమ భూముల పక్కనే ఉన్న రైతులు సాగు చేసుకుంటూ లక్షలు ఆర్జిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొందరపడి భూములు ఇచ్చి తాము నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉండవల్లి, ఉద్దండరాయపాలెం తదితర ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రాజధాని శంకుస్థాపన జరిగే ప్రదేశానికి కరకట్ట మీద నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల వరకూ ప్రభుత్వం రోడ్డు నిర్మించింది. ఈ రోడ్డు అంతా పొలాల మీద నుంచే వెళ్లింది. ఇప్పుడు రైతులు ఈ రోడ్డులను తవ్వేసి, సాగుకు దిగడంతో శంకుస్థాపన ప్రదేశానికి నేరుగా వెళ్లే అవకాశం లేకుండాపోయింది. దీంతో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ రోడ్డు వృధాగా మారింది. తాజాగా వెలగపూడి వద్ద తాత్కాలిక సెక్రటేరియట్ నిర్మాణానికి కావల్సిన ఇసుక తీసుకువెళ్లడానికి ప్రొక్లైన్లు రైతులు అడ్డుకున్నారు.
కొలిక్కి రాని గ్రామ కంఠాల సమస్య
రాజధాని కోసం భూ సమీకరణ చేస్తున్నప్పుడు మంగళగిరి మండలం దొండపాడు, కురగల్లు, నిడమర్రు, ఉండవల్లి, పెనుమాక, తళ్లూరు మండలంలోని అనంతవరం, వెలగపూడి, వెంకటపాలెం తదితర గ్రామాల్లోని గ్రామ కంఠాలను కూడా తీసుకున్నారు. రైతులు ఎంత భూమి ఇచ్చినా, 500 గజాల స్థలాన్ని ఇస్తామని చెప్పారు. భూములు ఇచ్చిన ఉమ్మడి కుటుంబం రైతులు పరిహారం కింద తమకు 10 సెంట్లకు పైగా భూమి కావాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామ కంఠాలకు సంబంధించి చాలా చోట్ల రికార్డులు లేవు. తమ పూర్వీకుల నుంచి వస్తున్న భూమిని వీరు అనుభవిస్తున్నారు. 2014 డిసెంబర్ 14 నాటికి గ్రామ కంఠాల్లో ఉన్న కట్టడాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని, అంతకు ముందున్న కట్టడాలకు పరిహారం ఇవ్వబోమని ప్రభుత్వం చెపుతోంది. అంతే కాకుండా చాలా చోట్ల గ్రామ శివార్లలో అనేక మంది ఇళ్ళు నిర్మించుకున్నారు. అందువలన గ్రామ పరిధిని విస్తరించి, వీటికి కూడా పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. వీటిన్నంటికి సంబంధించి సెక్షన్ 9(2) కింద రైతులు రెవెన్యూ శాఖకు అర్జీలు పెట్టుకుంటూ వస్తున్నారు. ఈ అర్జీలు వందల సంఖ్య దాటిపోయింది. దీనిపై విచారణ జరిపేందుకు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌ను నియమించారు. ఆయనకు ఇతరత్రా బాధ్యతలు అప్పగించడం వలన ప్రస్తుతానికి వీరి సమస్యను పక్కన పెట్టారు.
ఇదిలా ఉండా మంగళగిరి, తుళ్లూరు మండలాల్లో అటవీ, అసైన్డ్ భూములు ఉన్నాయి. 2006లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ భూములను స్వాధీనం చేసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ భూములపై ఎటువంటి లావాదేవీలు జరపరాదని ప్రభుత్వం అప్పట్లోనే ప్రకటించింది. కానీ కొన్ని గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు జరిగాయి, మరికొన్ని చోట్ల జరగలేదు. దీంతో ఈ భూములను అనేక సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న రైతులు ప్రభుత్వానికి అడ్డం తిరిగారు. ఈ రెండు మండలాల్లో సుమారు 2000 ఎకరాల వరకూ ఇటువంటి భూమి ఉంది. ఈ భూమి తమదంటూ రైతులు చెపుతున్నారు. ఆధారాలేమైనా ఉంటే చూపించమని రెవెన్యూ అధికారులు కోరుతున్నారు. ఈమధ్య కొంతమంది రైతులు ఈ భూములకు సంబంధించిన రికార్డుల కోసం ఆర్‌టిఐ కింద రెవెన్యూ అధికారులను కోరగా, తమ వద్ద ఎటువంటి రికార్డులు లేవని స్పష్టం చేశారు. 2006 ముందు వరకూ ఈ అసైన్డ్ భూములను చాలా మంది అమ్ముకున్నారు. ఇప్పటికే ఈ భూమి చాలా మంది చేతులు మారింది. రాజధానికి భూసేకరణ జరుగుతున్న సమయంలో ఈ అటవీ భూమిని డీ నోటిఫైడ్ చేసి, దాన్ని కూడా తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కొలిక్కి రాని అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇది కూడా వివాదాస్పంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.