రాష్ట్రీయం

చిరుత హంగామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్రేయపురం: తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామంలో సోమవారం సాయంత్రం ఒక చిరుత హంగామా సృష్టించింది. నలుగురు రైతులను గాయపరచింది. అనంతరం అది ఒక కొబ్బరి చెట్టుపైకి ఎక్కింది. దీనితో పోలీసు, అటవీ అధికారులు అక్కడే మాటువేసి, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. గ్రామస్తులు సైతం పెద్ద సంఖ్యలో కర్రలతో మోహరించారు. కింద జరుగుతున్న హంగామాతో తనకేం పనిలేనట్టు హాయిగా చిరుత కొబ్బరి చెట్టుపై విశ్రాంతి తీసుకుంటోంది. అంకంపాలెం గ్రామంలోని వరిచేలో పనిచేస్తున్న ఓ వ్యక్తి సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో పంటపొలాల్లో పడుకుని ఉన్న చిరుతను చూసి భయంతో కేకలు వేశాడు. దీనితో పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న నలుగురైదుగురు కూలీలు అక్కడకు వచ్చారు. వీరందరినీ చూసిన చిరుత ఒక్కసారిగా వారిపై దాడిచేసింది. ఈ ఘటనలో కరుటూరి నరేష్, ఎడ్ల చిట్టిబాబు, వనజెర్ల సతీష్, తల్లిబాబు గాయపడ్డారు. గాయపడిన వారి ఆర్తనాదాలతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. దీనితో కొద్దిసేపు హంగామా సృష్టించిన చిరుత సమీపంలోని ఒక కొబ్బరి చెట్టుపైకి ఎక్కి నక్కింది. రైతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో కర్రలతో కొబ్బరి చెట్టు చుట్టూ గుమిగూడారు. సమాచారం తెలుసుకున్న ఆత్రేయపురం ఎస్సై నాగార్జునరాజు, రావులపాలెం ఎస్సై విద్యాసాగర్, సిబ్బంది చిరుత దాగిన ప్రదేశానికి చేరుకున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత నక్కివున్న కొబ్బరి చెట్టు వద్దకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. చీకటిపడటంతో ఆ ప్రదేశంలో ఒక జనరేటర్ ఏర్పాటుచేశారు. రైతులు కాల్వగట్టున మంటలు వేశారు. చిరుత తప్పించుకోకుండా పట్టుకోవడానికి ఏర్పాట్లుచేస్తున్నారు. కాగా చిరుత దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం, కొత్తపేట ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.