రాష్ట్రీయం

అడవి తల్లి ఒడిలో ఆదివాసీల కోలాహలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,్ఫబ్రవరి 4: ఆదివాసీల సంస్కృతి, సనాతన సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే నాగోబాకు మెస్రం వంశస్తులు మహాపూజలు నిర్వహించడంతో కెస్లాపూర్ జాతర ప్రారంభమైంది. పుష్యమాస అమావాస్య ను పురస్కరించుకొని సోమవారం అర్ధరాత్రి నాగోబా మూల విరాట్టుకు పవిత్ర గంగాజలంతో అభిషేకించి, గోవాడలో మెస్రం ఆడపడుచులు ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాలను సమర్పించి సాంప్రదాయ పూజలతో జాతర ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అడవి తల్లి ఒడిలో ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే కెస్లాపూర్ నాగోబా జాతర సంధర్భంగా పొరుగునే గల మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల నుండి ఆదివాసీ తెగలోని మెస్రం వంశస్తులు చేరుకొని తమ ఇలవేల్పు నాగోబా సన్నిదిలో పూజలతో తరించిపోయారు. సోమవారం ఉదయం నుండే ఎడ్లబండ్లు, వాహనాలు, కాలి నడకన ఆదివాసీలు నాగోబా చెంతకు చేరుకోవడం, సాంప్రదాయ పూజలు ఘనంగా సాగడంతో కెస్లాపూర్ అడవి తల్లి పులకించిపోయింది.
జిల్లా నలుమూలలే కాకుండా వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన మెస్రం వంశస్తులు పవిత్ర గంగాజలాలతో పాత దేవ స్థానానికి చేరుకొని మర్రిచెట్ల నీడన బస చేశారు. ఆదివాసీల సనాతన ఆచారం మేరకు ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో తయారు చేసిన కొత్త కుండలను తీసుకవచ్చి నాగోబా సన్నిదిలో పూజలు నిర్వహించారు. ఆతర్వాత అక్కడే ఉన్న గోవాడగా పిలిచే కోనేరు నుండి ఆడపడుచులు కొత్త కుండల్లో పవిత్ర జలాలను తీసుకరాగా మెస్రం వంశానికి చెందిన అల్లుల్లు ప్రత్యేకంగా ఆలయం వెనక గల మట్టి పుట్టలు తయారు చేసి తమ సాంప్రదాయం మేరకు నియమ నిష్టలతో పూజలు గావించారు. పక్షం రోజుల కిందటే జన్నారం సమీపంలోని హస్తినమడుగు గోదావరి నది నుండి 125 కి.మీటర్ల పాదయాత్రతో తీసుకవచ్చిన పవిత్ర గంగాజలాలతో ముందు గా నాగోబా దేవతకు అభిషేకం చేశారు. ఆదివాసీ గిరిజనులైన మెస్రం వంశస్తులు అర్చకులుగా వ్యవహరిస్తూ కటోడ (పూజారి) హన్మంతురావు, వెంకట్రావులు పూజా సామాగ్రితో ఆలయ ప్రవేశం చేసి సాంప్రదాయ పూజలకు అర్ధరాత్రి శ్రీకారం చుట్టడంతో జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన నాగోబా దేవాలయ ప్రాంగణం భక్తుల సందడితో పండగ వాతావరణాన్ని తలపించింది. మెస్రం వంశానికి చెందిన మడావి, మర్సుకోల, పుర్క, మెస్రం, వెడ్మ, పంద్ర, ఉర్వెత తెగలకు సంబంధించి ఆదివాసీ గిరిజనులు తమ ఇంటిల్లిపాదితో ఆలయ సాంప్రదాయ ప్రకారం అర్చకులుగా వ్యవహరిస్తూ మహాపూజల్లో తరించిపోయారు. అనంతరం అర్ధరాత్రి జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, ఐటిడిఏ పీవో కృష్ణ ఆదిత్య, ఐటిడి ఏ చైర్మెన్ లక్కెరావు, వివిధ శాఖల అధికారులు నాగోబాకు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించారు.
కెస్లాపూర్ నాగోబా జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండగగా గుర్తించడంతో ఈనెల 7న అధికారికంగా గిరి దర్బార్ ఏర్పాటు చేయనున్నారు. భక్తుల సౌకర్యార్థం ఈ ఏడాది సైతం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

చిత్రాలు.. పూజలందుకుంటున్న నాగోబా మూలవిరాట్టు
* పవిత్ర గంగాజలతో ఆలయాన్ని శుద్ధి చేస్తున్న కటోడాలు *జాతరలో తుడుం వాయిస్తున్న గిరిజనుడు