రాష్ట్రీయం

ప్రత్యక్ష ఎన్నికలకే మొగ్గు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 2: రాష్ట్రంలోని నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ తదితర నగర పాలక సంస్థలు, వివిధ మున్సిపాలిటీలకు చాలాకాలంగా ఎన్నికలు జరగలేదు. వీటన్నింటికీ జూన్, జూలై నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అయితే ఇప్పటివరకూ కార్పొరేషన్లకు, మున్సిపాలటీలకు పరోక్ష పద్ధతిన ఎన్నికలు జరుగుతున్నాయి. దీనివలన అన్ని రాజకీయ పార్టీలకు సమస్యలు ఎదురవుతున్నాయి. నగరపాలక సంస్థ మేయర్లు, మున్సిపాలిటీల చైర్మన్ పదవులకు పరోక్షంగా ఎన్నికలు నిర్వహించడం వల్ల అనేక సమస్యలు ఎదురయ్యాయి. పార్టీల్లో గ్రూపులను సంతృప్తి పర్చేందుకు ఐదేళ్ళ పదవీకాలాన్ని రెండు భాగాలుగా చేసి, ఇద్దరికి కట్టబెట్టేవారు. ప్రత్యక్ష ఎన్నికల వలన ఈ సమస్య పూర్తిగా పరిష్కారమవుతుంది. ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగేవి. చంద్రబాబు హయాంలోనూ ఈ పద్ధతి కొంతకాలం కొనసాగింది. తరువాత రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పరోక్ష ఎన్నికలకే మొగ్గుచూపింది. అయితే చంద్రబాబు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు ఈ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తే మంచిదన్న ఆలోచనకు వచ్చారు. ఎట్టకేలకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా మున్సిపల్ చట్టాన్ని సవరించాలని కూడా నిర్ణయించారు. త్వరలోనే ఈ ప్రక్రియ మొదలవ్వబోతోంది.