రాష్ట్రీయం

మోదీ ఏం చేస్తున్నారో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 10: దేశ ప్రధాని నరేంద్రమోదీ ఏమీ చేస్తున్నారో భగవంతుడికీ అర్ధం కావడం లేదని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. స్వగృహంలో ఆదివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయపార్టీలు కోరిన మీదటే ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విభజించిందన్నారు. రాష్ట్ర విభజనకు బీజేపీ తన పూర్తిమద్దతు ఇచ్చిందన్నారు.
అటువంటిది కాంగ్రెస్ పార్టీ అపవాదును ఎదుర్కొంటుందన్నారు. ఏపీని విభజించిన తదుపరి విభజన చట్టంలో పేర్కొన్న విధంగా హామీలు నెరవేర్చాల్సి ఉందన్నారు. అటువంటిది ఏపీకి ప్రత్యేక హోదాను ఎందుకు ఇవ్వ డం లేదో అర్ధం కావడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తిరుపతి ఎన్నికల సభలో మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజధాని నిర్మా ణం అద్భుతంగా ఉండేదని, అభివృద్ధి బాగుండేదన్నారు. ఎన్నికల్లో సైతం ఈ విషయాన్ని కాంగ్రెస్ చెప్పిందని, రాజధాని నిర్మాణానికి అన్ని సదుపాయాలు కల్పించడం, పోలవరం ప్రాజెక్టును పూర్తి గా భరించడం, లోట్ బడ్జెట్‌ను సైతం కేంద్రం భరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిందని, రాయలసీమకు రాయితీలు కల్పిస్తామంటూ కాంగ్రెస్ చెప్పిందన్నారు. ఉత్తరాఖండ్, బీహా ర్, జార్ఘండ్, మధ్యప్రదేశ్‌లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కల్పించిన సదుపాయాలు ఇక్కడ లేకుండా పోయాయన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేకపోవడం వలనే కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనే ధర్మపోరాట దీక్షకు మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. ప్రతి తెలుగు పౌరుడు దీనిని బలపరుస్తారన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏపీని అన్నివిధాలా ఆదుకోవాలన్నారు.