రాష్ట్రీయం

17న టీఎస్సాఆర్ టీవీ-9 నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 10: విశాఖ నగరంలో ఈనెల 17వ తేదీన టిఎస్సాఆర్, టీవీ-9 నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. స్వగృహంలో ఆదివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుబ్బరామిరెడ్డి లలితకళాపరిషత్ ఆధ్వర్యంలో టిఎస్సాఆర్-టీ వీ-9 నేషనల్ ఫిల్మ్ అవార్డు ప్రధానోత్సవ వేడుకలను నగరంలోని పోర్టు స్టేడియం(క్రికెట్ గ్రౌండ్స్)లో నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు ఉత్సవం ప్రారంభమవుతుందన్నారు. ప్రముఖ సినీ తారలు, దర్శకులు, నిర్మాతలకు అవార్డుల ప్రదానం చేస్తామన్నారు. ఇందులో తెలుగు, కన్నడం, పంజాబీ, మళయాళం తదితర భాషలకు చెందిన తారలు పాల్గొంటారని, జాతీయ స్థాయిలో జరిగే అవార్డుల ప్రధానోత్సవంలో సినీతారలు పెద్ద ఎత్తున పాల్గొనడం ఇదే తొలిసారి అవుతుందన్నారు. చిరంజీవి, మహేష్‌బాబు, వెంకటేష్, బ్రహ్మానందం, కృష్ణంరాజు, మోహన్‌బాబు, నాగచైతన్య, నాగార్జున, జూనియర్ ఎన్‌టిఆర్, బాలకృష్ణ, మీనా, పరుచూరి గోపాలకృష్ణ తదితర నటులు పాల్గొంటారన్నారు. ఉత్తమ సినీతారల అవార్డులను శ్రీదేవి మెమోరియల్ అవార్డు పేరిట ఇస్తున్నట్టు చెప్పారు. ఔట్‌స్టాండింగ్ హీరోలు, హీరోయిన్లకు, ఉత్తమ దర్శకులకు, బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డులను 2017, 2018 సంవత్సరాలకు అందిస్తామన్నారు. ఆ రోజు కార్యక్రమానికి 50 నుంచి 60వేల మంది ప్రేక్షకులు తరలివస్తారన్నారు. వీరు కాకుండా టీవీ-9 ద్వారా లక్షలాది మంది దీనిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఈవిధంగా ప్రేక్షకులకు తాను అందించే వినోదమే తనకు ఎంతో శక్తిని ఇస్తుందన్నారు. మీడియా పార్టనర్‌గా డెక్కల్ క్రానికల్ వ్యవహరిస్తోంది. అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఆరోజు సాయంత్రం ఐదుగురు సినీ తారల డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుందన్నారు. జాతీయ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ మెంబర్లుగా నగ్మా, పింకీరెడ్డి, డాక్టర్ శోభా కామినేని, జీవిత, మీనా, కెఎస్ రామారావు, నరేష్, పరుచూరి గోపాలకృష్ణ, రఘురామ కృష్ణంరాజు వ్యవహరిస్తున్నట్టు వివరించారు. అభిమాన హీరో, హీరోయిన్లకు సంబంధించి అవార్డుల ఎంపికకు ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

చిత్రం..నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవ బ్రోచర్‌ను విడుదల చేస్తున్న డాక్టర్ సుబ్బరామిరెడ్డి