రాష్ట్రీయం

రథసప్తమి వేళ.. అఖండ జ్యోతి దివ్యదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్వపల్లి: రథసప్తమి పర్వదిన వేడుకలలో భాగంగా రాష్ట్రంలోనే ప్రప్రథమంగా నిర్మిస్తున్న అఖండ జ్యోతి స్వరూప శ్రీ సూర్యనారాయణ మూర్తి ఆలయంలో మంగళవారం జ్యోతి దర్శనంతో భక్తులు భక్తిపారవశ్యంతో మునిగిపోయారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని తిమ్మాపురం శివారులో నూతనంగా నిర్మిస్తున్న సూర్యనారాయణ దేవాలయం పనులు తుదిదశకు చేరుకున్నాయి. కాగా, రథసప్తమి వేడుకలలో భాగంగా గర్భాలయంలో సూర్య భగవానుని పటాన్ని ఉంచి దీపం వెలిగించి ఉదయం నుండి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం సూర్య కిరణాలు ఆలయంలో ఉంచిన పటంపై పడ్డాయి. దీంతో ఉదయం నుండి భక్తులు పెద్దసంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా మధ్యాహ్నం తర్వాత ఆలయంలో వెలిగించిన జ్యోతి ఎవరి ప్రమేయం లేకుండా అతిచిన్నగా వెలుగుతూ ఆరిపోతూ తిరిగి వెలుగుతూ ఒక్కసారిగా అఖండ జ్యోతిగా పెద్దగా దర్శనమిచ్చింది. ఈ జ్యోతి దర్శనంతో భక్తులు పెద్దఎత్తున అక్కడికి చేరుకొని సూర్యనారాయణస్వామికి జయజయనాదాలు పలికారు. ఈ వింతను చూసేందుకు చుట్టపక్క గ్రామాల్లోని భక్తులు పెద్దఎత్తున దేవాలయాన్ని చేరుకున్నారు. రథ సప్తమి అయినందునే సూర్య భగవానుడి అద్భుతమంటూ భక్తులు చర్చించుకోవడం వినిపించింది. సామాజికమాద్యమాల్లో సైతం ఈ వీడియో వైరల్‌గా మారింది.