రాష్ట్రీయం

ప్రత్యేక హోదా వద్దన్నదే బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రభుత్వ నిధులతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు చేస్తున్నారని, ఢిల్లీకి వెళ్లే ప్రత్యేక రైలు కోసం కోటి రూపాయిల వరకూ ప్రభుత్వ నిధులనే వెచ్చించారని, అలాగే ఇతర ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వ నిధులను, భవనాలను, సౌకర్యాలను దుర్వినియోగం చేశారని ఏపీ బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్ల పేర్కొన్నారు. మాజీ డీజీపీ , బీజేపీ థింక్‌ట్యాంక్ కమిటీ చైర్మన్ వీ దినేష్‌రెడ్డితో కలిసి హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. మోసం దగాలకు చంద్రబాబునాయుడు కేరాఫ్ అడ్రస్ అని, మోసపు రాజకీయం అనే చిరుమానాతో లేఖ రాస్తే అది కరెక్టుగా చంద్రబాబుకు చేరుతుందని ఎద్దేవా చేశారు. స్పెషల్ స్టేటస్ అక్కర్లేదని తొలుత చెప్పింది చంద్రబాబేనని, ఇపుడు మాటలు మార్చి ఏదేదో చెబుతున్నారని ఆరోపించారు. ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష పేరుతో కొంగజపం చేశారని, ఈ తరహా దీక్ష ఇది 27వదని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి రావడాన్ని సహించలేకపోయిన టీడీపీ నేతలు నానా యాగీ చేశారని, సీఎం ఆదేశాల మేరకు విజయవాడలో పిచ్చిపిచ్చి హోర్డింగ్‌లు పెట్టారని ఆరోపించారు. ఈశాన్య రాష్ట్రాలకు 11 మంది ముఖ్యమంత్రులతో కూడిన కమిటీ చేసిన సిఫార్సుల మేరకు 2016 ఆగస్టు 17న ప్రత్యేక హోదాకు సంబంధించిన నిధులను కేంద్రం విడుదల చేసిందని, ముఖ్యమంత్రుల కమిటీ సిఫార్సు చేసినపుడు ఏమీ మాట్లాడని చంద్రబాబు ఆ తర్వాత కూడా అనేక మార్లు పత్రికల్లో ప్యాకేజీయే మేలు, ప్యాకేజీకి మించింది ఏముందో చెప్పండి, ఆధారాలతో రండి, మనమే ఎక్కువ సాధించాం, కేంద్రం అన్నీ ఇచ్చింది అంటూ మాట్లాడారని, అప్పటి కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా వంత పాడారని ఒక దశలో చంద్రబాబు థ్యాంక్యూ మోదీ అని చెప్పుకోవడం కూడా పత్రికల్లో వచ్చిందని ఇపుడు అవన్నీ మరచి ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వ్యయంతో ఢిల్లీలో దీక్షలు ఏమిటని? ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని అన్నారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా కల్పించి ఉంటే ఎంత మేరకు నిధులు వచ్చేవో లెక్కలు వేసి 16వేల కోట్లు ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదిస్తే ఇపుడు ప్యాకేజీ వద్దని చంద్రబాబు అంటున్నారని చెప్పారు. కేంద్రంపై అనేక రకాల ఆరోపణలు చేసి సింపతీ కొట్టేయాలని చూస్తున్నారని రాజధాని నిర్మాణానికి 2500 కోట్లు ఇస్తే ఆ నిధులు ఏం చేశారని లెక్కలు అడగడం తప్పా అని సుధీష్ ప్రశ్నించారు. చంద్రబాబు తన కుటుంబాన్ని బాగు చేసుకుని అభివృద్ధి చేసినట్టు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కూడా అభివృద్ధి చేయాలని అన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను దోచుకుంటుంటే కేంద్రం చూస్తూ ఊరుకోదని అన్నారు. 17 ఏళ్లలో అన్ని ఈశాన్య రాష్ట్రాలకు కలిపి ఇచ్చింది కేవలం 3800 కోట్లు మాత్రమేనని, కాని ఆంధ్రాకు ఇస్తామన్నది 16వేల కోట్లు అని పేర్కొన్నారు.
విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ ఏపీ ప్రధాన అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్ల