రాష్ట్రీయం

చెర్వుగట్టుకు భక్త జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 13: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి కల్యాణం నయనానందకరంగా, భక్త జనుల శివనామస్మరణల మధ్య వైభవంగా జరిగింది. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుండి తరలివచ్చిన శివభక్తులు, శివసత్తులతో చెర్వుగట్టు పుణ్యక్షేత్రం భక్త జనసంద్రంగా మారింది. నార్కట్‌పల్లి-అద్దంకి జాతీయ రహదారి, చెర్వుగట్టు దారులు, గుట్ట పరిసరాలన్ని వాహనాలు, భక్తజనంతో కిటకిటలాడాయి. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరుడి కల్యాణానికి ముందు స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు ఘట్టాన్ని శైవశాస్త్రానుసారం చుడముచ్చటగా నిర్వహించారు. పల్లకి ఊరేగింపుతో సేవతో కల్యాణమండపానికి శివపార్వతులను తోడ్కోని వచ్చి రంగురంగుల రకరకాల పూలు, విద్యుత్ దీపాలంకరణలు, పచ్చని తోరణాలతో అలంకరించిన కల్యాణ మండపంలో ఆసీనులుగావించారు. పట్టువస్త్రాలు, పూలమాలాంకృతులైన వధూవరులు శివపార్వతులను ముస్తాబు చేసి కల్యాణఘట్టాన్ని రమణీయంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు రామలింగేశ్వర్మ సారధ్యంలోని అర్చక బృందం శివపార్వతుల కల్యాణోత్సవాన్ని శాస్తయ్రుక్తంగా వేదమంత్రోచ్చరణల మధ్య, భక్తుల హరహర మహాదేశ, శంభోశంకర స్మరణల మధ్య జరిపించారు. శివ పార్వతుల మంగల్యాణ ధారణ ఘట్టాన్ని తిలకించిన భక్తజనం భక్తీ పారవశ్యంతో పులకించారు. అనంతరం తలంబ్రధారణ ఘట్టం నిర్వహించారు. ప్రభుత్వం తరుపునా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ దంపతులు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. పార్వతి జడల రామలింగేశ్వరుల కల్యాణోత్సవం పిదప స్వామిఅమ్మవార్లకు వేలాది మంది భక్తులు ఒడి బియ్యం సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు సమర్పించిన ఒడి బియ్యం చెర్వుగట్టుపై రాశులుగా కనిపించాయి. అనంతరం స్వామి, అమ్మవార్లను చెర్వుగట్టు గుట్టపై తీరు వీధుల్లో ఊరేగించారు. బుధవారం తెల్లవారుజామున నిర్వహించిన పార్వతి జడల రామలింగేశ్వరుల కల్యాణ ఘట్టాన్ని వీక్షించేందుకు ఒక రోజు ముందు మంగళవారం అర్ధరాత్రి కల్లా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కొండపైన రాత్రి, చలి మంచులో జాగరణ చేస్తు స్వామిఅమ్మవార్ల కల్యాణాన్ని తిలకించి తాము చలిలో పడిన ఇబ్బందులు సైతం మరిచి పులకించారు. స్వామివారికి పాదుక మొక్కలను సమర్పించడంలో భక్తులు పోటీ పడ్డారు. కల్యాణోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ అడుగడున భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. 100కుపైగా సీసీకెమెరాలతో చెర్వుగట్టు, పరిసరాలను పూర్తిగా నిఘా నేత్రంతో పర్యవేక్షించారు. కొండపైకి కల్యాణోత్సవం దృష్ట్యా వాహనాలను అనుమతించలేదు. కల్యాణోత్సవానికి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, దేవస్థానం చైర్మన్, ఎంపీపీ రెగట్టే మల్లిఖార్జున్‌రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ సులోఛన, సర్పంచ్ రమణబాలకృష్ణ, ధర్మకర్తలు యామ దయాకర్, విజయలక్ష్మీ, పశుపతి, డిఎస్పీ గంగారామ్, సీఐ నరేందర్, ఎస్‌ఐ విజయ్‌కుమార్‌లు పాల్గొన్నారు.

చిత్రాలు.. పార్వతి జడలరామలింగేశ్వరుల కల్యాణోత్సవానికి తరలివచ్చిన భక్తజనంతో
చెర్వుగట్టు క్షేత్రం, *కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు,
తలంబ్రాలు తీసుకువస్తున్న శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్