రాష్ట్రీయం

ఖమ్మం నుంచే బరిలోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని మాజీ ఎంపీ రేణుకా చౌదరి స్పష్టం చేశారు. గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న ఆమె గురువారం నాడు హైదరాబాద్‌లోని తన నివాసంలో ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులతో భేటీ అయ్యా రు. దాదాపు నాలుగు గంటల పాటు వివిధ అంశాలపై నేతలతో చర్చించారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పీసీసీ ప్రధానకార్యదర్శి మానవతారాయ్‌లతో పాటు పలువురు ఖమ్మం జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల మనోభావాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం జిల్లాలో తమకు జరుగుతున్న అన్యాయాలపై పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నేతలు రేణుకావద్ద ఏకరవు పెట్టారు. తిరిగి ఖమ్మం లోక్‌సభకు పోటీ చేయాలని కోరారు. ఆ తర్వాత పాత్రికేయులతో మాట్లాడి న రేణుకాచౌదరి కార్యకర్తలను భ్రష్టుపట్టించే కార్యక్రమాలు పార్టీలో జరుగుతున్నాయని ఆరోపించారు. అసెం బ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ఓటమికి ఎవరు బాధ్యత వహించారని ఆమె నిలదీశారు. ఖమ్మం జిల్లాలో బినామీలుగా బతుకుతున్న వాళ్లకు చదువురాని వాళ్లకు బాధ్యతలు ఇస్తే పార్టీ నాశనం కాదా అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయ డం వల్లనే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచారని, నాయకులు గొప్ప కాదని అన్నారు. ఎన్నిక ల్లో తాను సహకరించలేదని ముగ్గురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారని, తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో రాహుల్‌గాంధీ దృష్టికి వెళ్లడం లేదని ఆమె అన్నారు. ఖమ్మం జిల్లా నుండే తాను ఎన్నికల బరిలోకి దిగుతానని పేర్కొన్నారు. కాగా రేణుకా చౌదరి కాంగ్రెస్‌కు జలక్ ఇస్తారా అనే చర్చ మొదలైంది. ఎంపీ టిక్కెట్‌పై అధిష్టానానికి ఆమె అల్టిమేటం విధించినట్టు చెబుతున్నారు. ఖమ్మం లోక్‌సభ టిక్కెట్ రాకపోతే కాంగ్రెస్ పార్టీకి ఆమె రాజీనామా చేసే యోచనలో ఉన్నారని కార్యకర్తలు చెబుతున్నారు. ఇందులో భాగంగానే తన భవిష్యత్ కార్యాచరణపై ఆమె హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించినట్టు వారు పేర్కొంటున్నారు.