రాష్ట్రీయం

మళ్లీ దీవించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 14: ‘విభజన చట్టంలో రాష్ట్రానికి అన్యాయం జరిగింది.. కట్టుబట్టలతో వచ్చాం.. సంపద సృష్టించాము.. సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశాం... మీ పెద్ద కొడుకుగా మిమ్మల్ని ఆదుకుంటున్నా...నన్ను నిండు మనసుతో మళ్లీ దీవించండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. గురువారం మధ్యాహ్నం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. దాంతో పాటు విజయనగరంలో డిగ్రీ కళాశాల, పతంజలి పార్కులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదలను ఆదుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. 23 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వెనుకబడిన వర్గాలను ఆదుకున్నామన్నారు. వచ్చే నెల నుంచి నిరుద్యోగులకు ఇస్తున్న ముఖ్యమంత్రి యువనేస్తం మొత్తాన్ని రూ.2 వేలకు పెంచుతున్నట్లు చేసినట్టు ప్రకటించారు. అలాగే త్వరలో పేదలందరికీ చంద్రన్న పెళ్లికానుక కింద రూ.35వేలు చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా స్వయం సహాయక సంఘాలకు అండగా ఉంటూ పసుపు కుంకుమ కింద రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశామన్నారు. రానున్న రోజుల్లో ఇచ్చాపురం నుంచి భోగాపురం వరకు బీచ్‌రోడ్డును, భోగాపురం నుంచి విశాఖపట్నం వరకు మరో బీచ్ రోడ్డును నిర్మిస్తామన్నారు. దీనివల్ల పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో ప్రధానీ మోదీ, తెలంగాణా సీఎం కేసీఆర్, వైసీపీ నేత జగన్ ఈ ముగ్గురూ ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్ర అభివృద్ధి విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆనందంగా ఉన్నారో, లేదో మీరే చెప్పండి తమ్ముళ్లు అంటూ జనంతో చెప్పించారు. ఇదిలా ఉండగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన కార్యక్రమం పూర్తయ్యిందని దానివల్ల ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విమానాశ్రయంతోపాటు విమాన మరమ్మతులు, ఓవర్‌హాలింగ్ వంటి యూనిట్లు రాబోతున్నాయన్నారు. దేశంలో మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు ఉందన్నారు. ఎయిర్ ట్రాఫిక్ దేశంలో 18 శాతం ఉంటే మన రాష్ట్రంలో 35 శాతంగా ఉందన్నారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఇక్కడ నుంచే వ్యవసాయ, ఇతర రకాల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకునే వీలుంటుందన్నారు.
జిల్లాలో ఏర్పాటు చేయనున్న గురజాడ అప్పారావు విశ్వవిద్యాలయంలో కొత్త కోర్సులు ప్రవేశపెడతామన్నారు. మెరైన్ బయోలజీ, ఓషనోగ్రఫీ, పెట్రో కెమికల్, జియాలజీ, టూరిజం వంటి ఆధునిక కోర్సులు ప్రవేశపెడతామని చెప్పారు. మరోపక్క రూ.634 కోట్లతో నిర్మించిన పతంజలి పార్కుకు ఆయన శంకుస్థాపన చేశారు. దీనివల్ల 34వేల మందికి ఉపాధి లభించనుందన్నారు. వీటితోపాటు గజపతినగరంలో చందన ఫుడ్‌పార్కు, రూ.4 కోట్లతో చిరుధాన్యాలతో ప్రాసెసింగ్ యూనిట్లు నెలకోల్పనున్నారని వివరించారు. జిల్లా అభివృద్ధికి ఇద్దరు రాజులను ఏకం చేసిన ఘనత టీడీపీదేనన్నారు. విజయనగరం రాజులు, బొబ్బిలి రాజులను ఏకం చేశామని వారిద్దరూ జిల్లా అభివృద్ధికి కలసి పనిచేస్తున్నారని వివరించారు. కలెక్టర్ ఎం.జవహర్‌లాల్, మంత్రులు గంటా శ్రీనివాసరావు, సుజయ్ కృష్ణ రంగారావు, అచ్చెన్నాయుడు, కిడారి శ్రావణ్‌లతోపాటు జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, హైమవతి, ఎమ్మెల్సీలు జగదీష్, గాదె శ్రీనివాసులనాయుడు, సంధ్యారాణి, ఎమ్మెల్యేలు పతివాడ నారాయణస్వామినాయుడు, మీసాల గీత, కేఏ నాయుడు, చిరంజీవులు, కోళ్ల లలితకుమారి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు, ఉపాధ్యక్షుడు సువ్వాడ రవిశేఖర్, ఐవీపీ రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొద్దుల నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. బహిరంగ సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు