రాష్ట్రీయం

జగన్‌కు రాజకీయం ఓ వ్యాపారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 16: ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో వైకాపా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత జగన్‌కు రాజకీయాలంటే వ్యాపారమని ధ్వజమెత్తారు. ఉండవల్లిలోని నివాసం నుంచి శనివారం టీడీపీ ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, బాధ్యులతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్ నమూనాలోని డొల్లతనం బయటపడిందన్నారు. మోదీ సీఎం కాకముందే గుజరాత్ అభివృద్ధి జరిగిందన్నారు. ఏపీ అభివృద్ధిని మోదీ జీర్ణించుకోలేరని వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధిపై కేసీఆర్‌కు కూడా కుళ్లేనన్నారు. హైదరాబాద్‌లో కూర్చుని జగన్ రాజకీయం చేస్తున్నారని, ఏపీలో నివసించడమే ఇష్టం లేని వ్యక్తి అని విమర్శించారు. జగన్ దృష్టిలో రాజకీయం అంటే వ్యాపారమని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో జైళ్లకు వెళ్లినవాళ్లకు, కేసుల్లో నిందితులకు సీట్లు ఇవ్వగా, ఈ ఎన్నికల్లో వ్యాపారులకే టిక్కెట్లు ఇస్తున్నారని, డబ్బు సంచులే వైకాపా టికెట్లకు కొలమానమని విమర్శించారు. వైకాపా సీట్లకు ప్రజాసేవ కొలమానం కాదన్నారు. ఎన్నికకు ఒక అభ్యర్థిని మార్చడం వైకాపాకు అలవాటన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారు ఈ ఎన్నికల్లో కనిపించరన్నారు. మోదీ, కెసీఆర్‌తో జగన్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అందులో భాగమే ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతన్నారు. కేసీఆర్ ఆతిథ్యంతోనే జగన్ హైదరాబాద్‌లో ఉంటున్నారని, టీడీపీకి అండగా ఉంటారని బీసీలపై కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారన్నారు. గతంలో వైఎస్ ఆదరణ రద్దు చేసి బీసీలకు అన్యాయం చేశారన్నారు. బీసీ ఫెడరేషన్లకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారన్నారు. ఈ ఐదేళ్లలో బీసీలకు 43 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. బీసీ భవన్‌లు, పెళ్లికానుక, విదేశీ విద్య వంటి వినూత్న పథకాలు అమలు చేశామన్నారు. గర్జన పేరుతో జగన్ బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని, కేసీఆర్ 28 కులాలను బీసీ జాబితా నుండి తొలగిస్తే జగన్ నోరు మెదపలేదన్నారు. హైదరాబాద్‌లో బీసీలకు అన్యాయం చేస్తే ప్రశ్నించరని, ఆ కులాలే వైకాపాను నిలదీయాలన్నారు. సామాజిక న్యాయమే టీడీపీ ధ్యేయమన్నారు. ఒక డిప్యూడీ సీఎం బీసీకి, మరో డిప్యూటీ సీఎం పదవిని కాపులకు ఇచ్చామని గుర్తు చేశారు. కాపులకు, బీసీలకు అతిముఖ్యమైన శాఖలు ఇచ్చామని, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు న్యాయం చేశామన్నారు. అవినీతి, నేర చరిత్ర జగన్‌కు ఉన్న దుర్వసనాలన్నారు.
రాష్ట్రం అభివద్ధికి అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారని విమర్శించారు. నిధులు ఇవ్వకుండా కేంద్రం మోకాలు అడ్డుతుంటే, కేసులు వేసి ఉద్రిక్తతలు పెంచి వైకాపా ఇబ్బందులు సృష్టిస్తోందన్నారు. కేంద్రం వివక్షకు విజయవాడలోని కనకదుర్గ వంతెన పనులే రుజువన్నారు. ఎన్ని కొర్రీలు వేయాలో అన్ని కొర్రీలు వేస్తున్నారన్నారు. రాష్ట్ర పర్యవేక్షణతో 82 శాతం పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. దీనిని స్థానిక నేతలే ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. సంక్షేమంలో, అభివృద్ధితో టీడీపీతో పోటీ పడలేరని స్పష్టం చేశారు. నిందలు వేయడం, ఆరోపణలు చేయడంలో వైకాపా, బీజేపీ ముందున్నాయన్నారు. ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదని, సకాలంలో సరైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.