రాష్ట్రీయం

అరుదైన జాతీయ జెండా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచంట, ఫిబ్రవరి 17: మన ఆంధ్రుడు పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాతో నాడు భారతమాత ఉప్పొంగిపోయింది. కోట్లాది ప్రజల గుండెల్లోనే చిరస్థాయిగా నిలిచి, దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోటపై రెపరెపలాడే జాతీయ జెండాను కుట్టు, అతుకు లేకుండా పూర్తిగా చేనేత మగ్గంపైనే అరుదైన రీతిలో రూపొందించాడు ఒక చేనేత కార్మికుడు. పట్టుదారాలతో రేయింబవళ్లు శ్రమించి రూపొందించిన ఈ జెండా ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కృతమై, ఎర్రజెండాపై ఎగరాలని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఎ.వేమవరం గ్రామానికి చెందిన జెండా రూపశిల్పి రుద్రాక్షల సత్యనారాయణ కోరుకుంటున్నాడు. పుట్టింది పేద కుటుంబంలో అయినా దేశభక్తిని మనస్సు నిండా నింపుకుని జాతీయ జెండాను రూపొందించడం ప్రారంభించాడు. గతంలో చిన్నమగ్గంపై చిన్న జెండాను 4-6 అడుగుల సైజులో పట్టుదారాలతో అతుకులు, కుట్లు లేకుండా అశోక చక్రంలో 24 రేఖలు వచ్చేటట్టుగా జెండాను రూపొందించాడు. నిబంధనల ప్రకారం ఈ జెండా ఢిల్లీలో ఎర్రకోటపై ఎగురవేయడానికి సైజు సరిపోదని తెలియడంతో నిరాశపడ్డాడు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఎర్రకోటపై ఎగురవేసే స్థాయిలో 8-12 అడుగుల జాతీయ జెండాను రూపొందించాలని నడుం బిగించాడు. ఈ జెండా రూపకల్పనకు సుమారు రూ.2లక్షలు అవసరం కావడంతో ఆచంట నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చెరకువాడ శ్రీరంగనాధరాజు ఆర్థిక సాయం అందించారు. దీనితో సుత్యనారాయణ పని కొంత సులువైంది. ఆ సైజు జెండా నేయడానికి ప్రస్తుతం ఉన్న మగ్గాల సైజు సరిపోకపోవడంతో పురాతనకాలంలో నేసే 10 అడుగుల మగ్గం సంపాదించాడు. ముందుగా గ్రాఫ్ గీసుకుని, దానిపై ఈ జెండాను నేయడం ప్రారంభించాడు. మూడు రంగులు, 24 రేకలు ఉండేవిధంగా 2400 పట్టుదారాలతో, చేనేతలోనే అద్భుతమైన జాంధాని, పైసాని వర్క్‌లతో జెండాను తయారుచేశాడు. ఈ జెండా లోపలి ధర్మచక్రం ఎంతోకాంతివంతంగా కనిపించడం విశేషం. సుమారు అయిదు నెలలుగా జెండాను రూపొందిస్తున్న సత్యనారాయణకు భార్య అమరావతి, బావ తమ్మామోహనరావు, గుడిమెట్ల రామలింగం సహకరించారు. ఆదివారం నాటికి పూర్తిస్థాయిలో రూపుదిద్దుకున్న ఈ జెండా సుమారు కిలో బరువు ఉంది.దేశంలో ప్రజలు ఐకమత్యంతో ఉండాలన్న ఉద్దేశ్యంతో అశోకచక్రంతోకూడిన జాతీయ జెండాను రూపొందించానని రుద్రాక్షల ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. నేతపనిలో గుండ్రం గా రావడం జరగదని, కానీ గుండ్రంగా అశోకచక్రం ఎటువంటి వంకరలు లేకుండా రావడం ఈజెండా ప్రత్యేకత అని తెలిపారు. ఈ జెండా తయారీ విషయం నర్సాపురం పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగారాజు ద్వారా కేంద ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందని, త్వరలోనే ఎర్రకోటపై ఈజెండా ఎగురగలదన్న ఆశాభావాన్ని సత్యనారాయణతోపాటు ఆచంట నియోజకవర్గ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
చిత్రాలు.. మగ్గంపై పట్టుదారాలతో నేసిన జాతీయ జెండా నేసిన రుద్రాక్షల సత్యనారాయణ