రాష్ట్రీయం

అట్టహాసంగా టీఎస్సార్, టీవీ 9 సినీ అవార్డుల ప్రదానోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: టీఎస్సార్ కళాపరిషత్, టీవీ-9 సినీ అవార్డుల ప్రదానోత్సవం విశాఖలో ఆదివారం సాయంత్రం అట్టహాసంగా జరిగింది. టీ సుబ్బరామిరెడ్డి నేతృత్వంలో ప్రతియేటా నిర్వహించే అవార్డుల కార్యక్రమానికి తెలుగు సినీ పరిశ్రమ నుంచి అతిరథ మహారథులు హాజరయ్యారు. తెలుగు సినీ అగ్రహీరోలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఘనత టీఎస్సార్‌కే దక్కుతుందని సినీ ప్రముఖులు ప్రశంసించారు. టీఎస్సాఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ పదేళ్లుగా సినీ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానన్నారు.

చిత్రాలు.. దాసరి స్మారక అవార్డు అందుకుంటున్న మోహన్‌బాబు *రామ్‌చరణ్ తరఫున చిరంజీవికి అవార్డు అందిస్తున్న రాజ్యసభ సభ్యుడు, కళాబంధు టీ.సుబ్బరామిరెడ్డి* సినీనటుడు బాలకృష్ణకు అవార్డు అందజేస్తున్న దృశ్యం,
* సినీహీరో నాగార్జునకు అవార్డు అందిస్తున్న దృశ్యం