రాష్ట్రీయం

అమరావతిలో కేజ్రీవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 18: బీజేపీ యేతర పక్షాల కూటమికి సంబంధించి భవిష్యత్ ఎన్నికల కార్యాచరణ ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సమాలోచనలు జరిపారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సోమవారం రాత్రి ఇద్దరూ దాదాపు రెండు గంటలకు పైగా భేటీ అయ్యారు. దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తులో అనుసరించాల్సి వ్యూవూహాలపై చర్చించారు. బీజేపీ యేతర పక్షాలతో ఈ నెల 23న ఢిల్లీలో మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపరు విధానాన్ని ఈ ఎన్నికల్లో ప్రవేశపెట్టాలని మరోసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని నిర్ణయించారు.
వీవీ ప్యాట్ స్లిప్‌లను వంద శాతం ఇవ్వాలని కూడా కోరాలని ప్రతిపాదించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పట్ల మోదీ అనుసరిస్తున్న వైఖరిపై కూడా వీరు చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీ యేతర పార్టీలతో ఏర్పాటు అవుతున్న కూటమిని బలహీన పరిచేందుకు మోదీ అనుసరిస్తున్న కుట్రలను ఛేదించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించారు. ఎన్నికలకు ముందు పొత్తు, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై కూడా వీరిద్దరు చర్చించారు. విజయవాడ వచ్చే ముందు కేజ్రీవాల్ పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామిని కలిసి సంఘీభావం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా, పోలింగ్‌కు ముందుగా మార్చిలో అమరావతిలో ధర్మపోరాట దీక్ష నిర్వహించేందుకు సూత్రప్రాయంగా ప్రతిపాదించారు. సహకరించని పార్టీల నేతలపై సీబీఐ దాడులతో బెదిరింపులు, తదితర అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. కూటమిలో కొన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌ను కలుపుకోవడంపై విభేదిస్తున్న నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన కార్యాచరణ రూపకల్పన చేసేందుకు ప్రతిపాదించారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, దేశాన్ని కాపాడేందుకు కొంత సర్దుబాటు తప్పదన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. కాగా, విజయవాడ వచ్చిన కేజ్రీవాల్‌కు రాష్ట్ర మంత్రి లోకేష్ స్వాగతం పలికారు. ఆయనకు ఒక ప్రైవేట్ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా రాష్ట్రంలో గత నాలుగున్నర ఏళ్లలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు.
ఆర్టీజీఎస్ ద్వారా పరిపాలనలో తెచ్చిన మార్పులు, టెక్నాలజీ సాయంతో అందిస్తున్న సేవలు వివరించారు. గ్రామాలకు టెన్ స్టార్ రేటింగ్, ఉపాధి హామీ పథకం అమలు గురించి తెలిపారు.
చిత్రం..అమరావతికి విచ్చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను శాలువాతో సత్కరిస్తున్న చంద్రబాబు