రాష్ట్రీయం

మోదీ ఓ అరాచకవాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 19: రాజకీయ లబ్ధి కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని తాకట్టు పెట్టేందుకు సైతం వెనుకాడబోరని, ఎలాంటి అరాచకానికైనా ఆయన సమర్థుడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. మంగళవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మంత్రులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాశ్మీర్‌లోని పుల్వామా దాడిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యక్తం చేసిన అనుమానాలపై దేశవ్యాప్త చర్చ జరుగుతోందని తెలిపారు. గోద్రాలో రెండువేల మంది నరమేధం ఇప్పటికీ గుర్తుందని, అప్పట్లో కొన్ని విదేశాలు సైతం మోదీని బహిష్కరించాయన్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వాల అస్థిరత ప్రమాదకరమన్నారు. సున్నితమైన సరిహద్దు రాష్ట్రాల్లో రాజకీయ లబ్ధిని చూడరాదన్నారు.
బీజేపీ రాజకీయాలతోనే జమ్ముకశ్మీర్‌లో సంక్షోభం నెలకొందని ఆయన అన్నారు. రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.1000 వేశాం.. డబ్బు తీసుకోవటానికి రైతులకు ఇబ్బంది లేదు.. ‘అన్నదాత సుఖీభవ’ను రైతులంతా స్వాగతిస్తున్నారు.. రాష్టవ్య్రాప్తంగా రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని ఆయన వివరించారు. ఎడ్లబండ్ల ర్యాలీలు, నవధాన్యాలు, పండ్లతో ఎడ్లబండ్ల అలంకరణలు రైతుల్లో సంతోషం రాష్ట్రానికి సుభిక్షమని, ఏపీలో రైతులకు జరిగిన మేలు దేశంలో ఎక్కడా జరగలేదని అన్నారు. రూ.24 వేల కోట్ల రుణమాఫీ, విపత్తు సాయం పెంపు, కౌలురైతులకు రూ.15వేల పెట్టుబడి సాయంతోపాటు 9గంటల విద్యుత్ సరఫరా అందుస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో రైతులకు ఎన్నో వినూత్న పథకాలు అమలు చేస్తున్నామని, సమర్థ నీటి నిర్వహణతో దిగుబడులు పెరిగాయని, దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచామని అన్నారు. 95 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికీ రూ.20వేలు, 74 లక్షల రైతు కుటుంబాలకు రూ.15వేల పెట్టుబడి సాయం, 60 లక్షల మందికి పింఛన్లు పదిరెట్లు చేశామన్నారు. పేదల సంక్షేమానికి ఏపీ ఒక నమూనాగా రూపుదిద్దుకుందని చెప్పారు. పసుపు-కుంకుమ, అన్నదాత-సుఖీభవ, ఎన్టీఆర్ భరోసాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలతో ప్రతిపక్ష నేత జగన్‌లో అలజడి మొదలైందని, దీంతో హైదరాబాద్‌లో కూర్చుని కేసీఆర్‌తో కలిసి కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.
వైసీపీలో చేరికలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆక్షేపించారు. తెలంగాణలో ఆస్తులకు పూచీ నాదని కేసీఆర్ వలసలకు హామీ ఇస్తున్నారని ఆరోపించారు. పోలవరంపై కేసులు వేసినవాళ్లతో వైసీపీ లాలూచీ పడుతోందని, ఏపీలో ప్రాజెక్టులను అడ్డుకునేవారితో కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వీళ్ల కుట్రలు నెరవేరితే ఏపీకి నీళ్లు రావని అన్నారు. మూడు పార్టీల కుట్రలతో ఏపీకి తీవ్రనష్టం జరుగుతుందని వీరికి ప్రజలే గుణపాఠం చెప్పి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని కోరారు.
చిత్రం.. ఉండవల్లి ప్రజావేదిక కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం తిత్లీ తుపాను బాధితుల సహాయార్థం విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం అందించిన రూ.71,95,400 చెక్కును స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు