రాష్ట్రీయం

వైఎస్ జగన్‌తో నాగార్జున భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సినీ నటుడు అక్కినేని నాగార్జున మంగళవారం లోటస్ పాండ్‌లోని ఆయన నివాసంలో కలిసి అరగంట సేపు చర్చించారు. దీంతో నాగార్జున గుంటూరు నుంచి పోటీ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారని, అందుకే జగన్‌ను కలిసారన్న ప్రచారం ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న నాగార్జున- జగన్‌ను మర్యాద పూర్వకంగానే కలిసానని, సంకల్ప యాత్ర దిగ్విజయం అయినందుకు అభినందించానని పేర్కొన్నారు. అంతేతప్ప రాజకీయాల పట్ల తనకు ఆసక్తి లేదని వివరించారు.