రాష్ట్రీయం

తెలంగాణకు ఉజ్వల భవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: తెలంగాణ రాష్ట్రానికి ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉందని 15 వ ఆర్థిక కమిషన్ చైర్మన్ నంద కిషోర్ సింగ్ పేర్కొన్నారు. తెలంగాణలో మూడు రోజుల పాటు పర్యటించేందుకు వచ్చిన కిషోర్ సింగ్‌తోపాటు కమిషన్ సభ్యులు మంగళవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణలో తాము పరిశీలించిన అంశాలన్నీ తాము రూపొందించబోయే నివేదికలో పొందుపరుస్తామని, ఈ రాష్ట్రానికి చేయూత ఇచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిస్తామని, ఏ విధంగా సాయం అందించాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అత్యంత సమర్థుడైన నాయకుడని, రాష్ట్రానికి మంచి నాయకత్వాన్ని అందిస్తున్నారని సింగ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉండటం వల్ల అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలుకు ఎలాంటి ఆటంకం ఉండబోదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం తదితర సాగునీటి ప్రాజెక్టుల వల్ల పంటల విస్తీరం పెరుగుతుందని, పంటల ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతాయన్నారు. పేదలకు కోసం చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని ఎన్‌కే సింగ్ పేర్కొన్నారు. సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణకు పేరు వస్తుందన్నారు. మిషన్ భగీరథ అద్భుతమైన పథకమని, ఏ ఇతర రాష్ట్రం చేపట్టని విధంగా ప్రతి జనావాసానికి తాగునీటి సౌకర్యం కల్పిస్తుండటం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి సమతులంగా లేకపోవడం ఇబ్బందికరమైన పరిస్థితి అన్నారు. పారిశ్రామిక అభివృద్ధికోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తాయన్నారు. పారిశ్రామిక, ఐటీ రంగాల్లో వస్తున్న పరిశ్రమలు, సంస్థలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకే పరిమితం అయాయన్నారు. కొత్తగా వస్తున్న పరిశ్రమలు, సంస్థల వల్ల ఈ నాలుగు జిల్లాల్లోనే ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. ఈ నాలుగు జిల్లాల్లోనే తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటోందని, మిగతా జిల్లాలు వెనుకబడి ఉన్నాయన్నారు. అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్ర అభివృద్ధి ఫలితాలు అందరికీ అందుతాయన్నారు. ప్రభుత్వం తీసుకున్న రుణాలు, ద్రవ్యలోటు ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా ఉందని మారిందని ఎన్‌కే సింగ్ పేర్కొన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత పాలకులపైనే ఉందన్నారు. బడ్జెట్‌లో రెవెన్యూ మిగులుగా తేలడం మంచి పరిణామం అని సింగ్ తెలిపారు. జీఎస్‌టీ వసూళ్లలో తెలంగాణ దేశంలోనే మేటిగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు కూడా మాట్లాడారు.

మీడియాతో మాట్లాడుతున్న 15వ ఆర్థిక కమిషన్ చైర్మన్ ఎన్.కే. సింగ్