రాష్ట్రీయం

స్పిన్నింగ్ మిల్‌లో భారీ అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంస్థాన్‌నారాయణపురం, ఫిబ్రవరి 19: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలంలోని వెంకంబావితండా వద్ద గల శ్రీరామా స్పిన్నింగ్ మిల్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముడి పత్తినుంచి ధారం తయారు చేసే ఈకంపెనీలో జరిగిన ప్రమాదంలో ధారం తయారు చేసే 6 భారీ యంత్రాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. వీటి విలువ సుమారు 2.50కోట్ల వరకు ఉంటుందని అంచనా, అలాగే మరో 50లక్షల విలువైన పత్తి, దారం, ఇతర సామాగ్రి దగ్ధం అయినట్లు ప్రాథమిక అంచనాలో తేలిందని, కంపెనీ జనరల్ మేనేజర్ నాగేశ్వరావు తెలిపారు. కంపెనీ నడుస్తున్న సమయంలో తెల్లవారుజామున కరెంటు షార్టు సర్‌క్యూట్ వల్ల ఒక ట్యూబ్ లైట్ వద్ద మంటలు చెలరేగినట్లు కార్మికులు వివరించినట్లు నాగేశ్వర్‌రావు తెలిపారు. కార్మికులు చూస్తుండగానే ఒక షెడ్డు మొత్తం మంటలు వ్యాపించినట్లు తెలిపారు. ఆసమయంలో అక్కడ నల్గురు పనిచేస్తుండగా, కంపెనీలో మొత్తం 60 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు తెలిపారు. కార్మికులు మంటలు ఆర్పడానికి చేసిన ప్రయత్నాలు విఫలం అయినట్లు తెలిపారు. దీనితో చౌటుప్పల్‌లో ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారన్నారు. కొంతమేరకు మంటలు ప్రక్కన ఉన్న షెడ్డులోకి వ్యాపించకుండా అడ్డుకోగల్గినట్లు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే చౌటుప్పల్ నుంచి అగ్నిమాపకయంత్రం హుటాహుఠీన వచ్చి మంటలు అర్పినట్లు వివరించారు. కాని, అప్పటికే షెడ్డులోని యంత్రాలు, పత్తి, దారం, ఇతర సామాగ్రి పూర్తిగా దగ్ధం అయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా అగ్నిమాపక అధికారి ఎ. యగ్ననారాయణ, యాదాద్రి జిల్లా అధికారి వీ. అశోక్‌లు కంపెనీ వద్దకు వచ్చి పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా సిబ్బందికి సూచనలు చేశారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలుసుకుంటామని తెలిపారు.
పొంతనలేని సమాధానాలు
చెబుతున్న సిబ్బంది?
అగ్నిప్రమాదం జరిగిన తీరును తెలుసుకోవడానికి వెల్లిన పత్రికా విలేకర్లకు ప్రమాదం జరిగిన తీరును కంపెనీ సిబ్బంది, కార్మికులు వేరువేరుగా పొంతనలేని విధంగా తెలుపుతుండటంతో పలు అనుమానాలకు తావిస్తుంది. కంపెనీ నడుస్తుండగా ఓక ట్యూబ్‌లైట్ వద్ద నుంచి మంటలు వచ్చాయని, వెంటనే మంటలు పెద్దఎత్తున వ్యాపించాయని కొందరు తెలిపారు. మొదట ఎక్కడ ప్రారంభమైనాయని చూడటానికి వెల్లగా, అటు మూలకు అని కొంతసేపు, ఇక్కడ కాదు మధ్యలో అని, అక్కడ కూడా కాదు మంటలు ఒక్కసారిగా లేచాయని రకరకాలుగా వివరించారు. కంపెనీలో ఎప్పుడూ పనిచేసే సీసీటీవీని పరిశీలించమని కోరగా, అది ఇప్పుడు పనిచేయడం లేదని, మంటలు వ్యాపిస్తాయని ప్రక్కన పడేసినట్లు మరొకరు వివరించారు. మొత్తానికి అగ్ని ప్రమాదం జరిగిన తీరు పలు అనుమానాలకు తావిస్తుంది. కంపెనీ నష్టాల్లో ఉండటంతో కావాలనే కంపెనీ యాజమాన్యం అగ్ని ప్రమాదం జరిగేటట్లు చేసిందని అక్కడికి వచ్చిన గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

చిత్రాలు.. స్పిన్నింగ్‌మిల్‌లో దగ్ధమైన యంత్రాలు