రాష్ట్రీయం

ఆధునిక వసతులతో శ్రీవారి సేవా భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 22: తిరుమలలో నూతనంగా శ్రీవారి సేవా భవనాలను ఆధునిక వసతులతో నిర్మించినట్లు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ చెప్పారు. శుక్రవారం శ్రీవారి సేవ భవన సముదాయాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కల్యాణ వేదిక వెనుక వైపున మహిళా సేవకుల కోసం రూ. 96 కోట్లతో సేవాసదనం-1, పురుష సేవకుల కోసం సేవాసదనం-2 భవనాలను ఆధునిక వసతులతో నిర్మించినట్లు చెప్పారు. భవిష్యత్తులో మరింత ఎక్కువ మంది శ్రీవారి సేవకులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఒక్కో భవనంలో 3 అంతస్తుల్లో 16 హాళ్లు ఉన్నాయని, దాదాపు 2వేల మంది బస చేయవచ్చని తెలిపారు. అలాగే 224 స్నానపు గదులు, వేడినీటి సౌకర్యం, 278 మరుగుదొడ్లు, 700 మందికి భోజనశాల, రిజిస్ట్రేషన్ హాలు, సత్సంగం హాలు, రిక్రియేషన్ హాలు, రెండు లిఫ్టులు, లాకర్లు, మంచాలు ఉన్నాయన్నారు. 2000 సంవత్సరంలో 195 మందితో ప్రారంభమైన శ్రీవారి సేవలో నేడు ప్రతి రోజు 1500 మంది, పర్వదినాల్లో 3వేలు నుంచి 3500 మంది సేవకులు పాల్గొంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా
ప్రసాద్‌బాబు ప్రమాణస్వీకారం
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యునిగా కడప జిల్లా రాయచోటికి చెందిన ఎస్.ప్రసాద్‌బాబు శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్ నూతన సభ్యుడితో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకోగా రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్ స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సెల్ డిప్యూటీ ఈఓ సి.మల్లీశ్వరిదేవి, పేష్కార్ రమేష్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.