రాష్ట్రీయం

ఆంధ్రాలోనే అవినీతి ఎక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశంలోనే అత్యంత అవినీతి ఆంధ్రాలో జరుగుతోందని తెలంగాణ పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. శనివారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఐటీ గ్రిడ్ సంస్థ తనదేనని చంద్రబాబు నాయుడు చెబుతున్నారని, మా ఆఫీసుకు మీ పోలీసులు ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఒక రాజకీయ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేస్తే అక్కడి నుండే కుట్ర వ్యవహారం వెలుగు చూసిందని అన్నారు. డేటా చోరీ కాలేదని ఒక రోజు, ప్రభుత్వ డాటా మాత్రమేనని ఇంకోరోజు, చోరీ అయ్యిందని మరోరోజు చంద్రబాబు చెబుతున్నారని ఆరు కంటైనర్లతో సామగ్రీ ఇటలీ నుండి వస్తే హైదరాబాద్‌లో ఇళ్లు కట్టిన చంద్రబాబు సత్యహరిచంద్రుడిలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు అమ్మా, నాన్నలకు హైదరాబాద్ తెలీదని అన్నారు. చంద్రబాబూ, లోకేష్‌లు 420 లా అడ్డంగా దొరికి ఇపుడు మళ్లీ ఆత్మగౌరవం అంటూ మాట్లాడుతున్నారని, తప్పించుకోవడానికి రోజుకో మాట మాట్లాడితే ఎవరూ నమ్మబోరని పేర్కొన్నారు. చంద్రబాబు ఆత్మగౌరవం గంగలో కలిసిందని అన్నారు. ఐదుగురు సభ్యులున్న కుటుంబం ఆస్తి రూ.1600 కోట్లు చూపించారని, మనువడు పుట్టి పుట్టగానే 85 కోట్లు చూపిస్తే దేశానికి ఏ రకమైన మార్గాన్ని చంద్రబాబు చూపిస్తున్నారని నిలదీశారు. ఎస్పీల దగ్గరకి వెళ్లి మంత్రులు కేసులు పెట్టడం ఎక్కడా చూడలేదని, ఐటీ సృష్టించిందీ, మొబైల్ కనిపెట్టిందీ తానే అన్నట్టు మాట్లాడటం చంద్రబాబుకు అలవాటుగా మారిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఐటీ కంపెనీవాళ్ల వ్యవహారంలో అంతగా ఎందుకు చంద్రబాబు మమేకం అవుతున్నారని ప్రశ్నించారు. 18 కేసులపై 20 సంవత్సరాలుగా స్టేల మీద తిరుగుతూ నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిపోయి హైదరాబాద్ విడిచి పారిపోయాడని అన్నారు. ఏపీకి సంబంధించిన నాయకుల ఆస్తులు అన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయని, టీడీపీలో 23 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయితే అభివృద్ధి అంటున్నాడని, అదే టీడీపీవారు మరో పార్టీలో చేరితే మాత్రం వారిని ఓడించాలని పిలుపు ఇస్తున్నాడని, అసలు చంద్రబాబుకు విలువలు ఎక్కడవని ప్రశ్నించారు. ఏపీలో ఏ ప్రాజెక్టుకు అయినా 10 శాతం కమిషన్ కోసం 3 అకౌంట్లు ఇచ్చారని, ఏపీలో నీతి పాలన సాగుతోందని రుజువు చేస్తే తాను మంత్రిపదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి ఏరియాల్లో కోట్లకు కోట్లు దొరికాయని ఆరోపించారు. తెలంగాణలో లింగయ్య యాదవ్, బండ ప్రకాష్ వంటి సామాన్య కుటుంబాలకు చెందిన వారిని రాజ్యసభకు పంపించామని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆ పార్టీ నేతలు డబ్బులు ఇవ్వడానికి వస్తే చెప్పుతో కొట్టాలని అన్నారు. ప్రభుత్వ ఆధీనంలోని విజయా డైరీ కుంగిపోతుంటే హెరిటేజ్ సంస్థకు మాత్రం లాభాలు ఎలా వచ్చాయని ఆయన నిలదీశారు. తాను ఒక్కడే మొత్తం తెలుగువారి ప్రతినిధిలా చంద్రబాబు మాట్లాడుతున్నారని తనను లీడర్‌ను చేశానని చెబుతున్న చంద్రబాబు ఆనాడు నెంబర్ గేమ్ ఆధారంగా సీఎం అయ్యారని గుర్తుంచుకోవాలని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. చంద్రబాబు అబద్దాలు చెప్పొద్దని, కాణిపాకంలో ఒట్టు వేయడానికి తాను సిద్ధమని పేర్కొన్నారు.