రాష్ట్రీయం

మాది ప్రజామేనిఫెస్టో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 14: జనసేన మేనిఫెస్టో ఎక్కడో ఏసీ గదుల్లో కూర్చుని ఐఎఎస్‌ల చేత రాయించలేదని, ప్రజల్లో తిరిగి ప్రజా సమస్యలపై అధ్యయనం చేసి రూపొందించిందే జనసేన మేనిఫెస్టో అని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీకి కీలకమైన యువతకు ఏడాదికి పది లక్షల ఉద్యోగాలను సృష్టించే విధంగా రూపకల్పన చేశామని చెప్పారు. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, విద్యా సంస్థలకు ఉచిత రవాణా, కాలేజీ విద్యార్థులకు డొక్కా సీతమ్మ పేరిట ఉచిత క్యేంటీన్లు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రధానాంశాలు ఈ వేదికపై పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో గురువారం జనసేన పార్టీ ఐదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ప్రజాపోరాట యాత్రలో ఎన్నో సమస్యలను గుర్తించామని, అవన్నీ క్రోడీకరించి అధ్యయనం చేసి మేనిఫెస్టో రూపొందించామన్నారు. రైతులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని, రైతులకు సాగు సాయంగా ఆదుకునేందుకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఎకరానికి అందిస్తామన్నారు. అరవై సంవత్సరాలు పైబడిన సన్న, చిన్నకారు, కౌలు రైతులకు నెలకు రూ.5వేలు పించన్ ఇస్తామన్నారు. వివిధ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం ఇస్తామని, ఎస్‌ఈజడ్ వంటి ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన రైతులకు పారిశ్రామీకరణలో భాగస్వాములను చేసి లాభాలు వచ్చేలా చేస్తామన్నారు. రూ. 5వేల కోట్ల పెట్టుబడితో గ్లోబల్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. దీనిద్వారా ప్రతి మండలంలోనూ శీతల గిడ్డంగులు, ఆహార ఉత్పత్తులను నిల్వ చేసుకునే సదుపాయం వంటికి కల్పిస్తామన్నారు. రైతులకు ఉచితంగా సోలార్ మోటార్లు అందిస్తామన్నారు. నదులను అనుసంధానం చేసి రిజర్వాయర్లకు మరమ్మతులు చేయడం, కొత్త రిజర్వాయర్ల నిర్మాణం చేస్తామన్నారు. విద్యార్థులకు ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించడమే కాకుండా ఉచితంగా రవాణా సదుపాయం కూడా ఇస్తామన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలు గానీ, మండలాల్లో గానీ ఆర్ట్సు, అండ్ సైన్స్ కాలేజీలు, వ్యవసాయ కళాశాలలు,
పోలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. పోటీ పరీక్షలకు కులాల ప్రాతిపదికన కాకుండా అన్ని పరీక్షలకు ఫీజు చెల్లించే విధంగా ఏడాదిలో ఒకసారే కట్టించుకుని అన్ని పరీక్షలు రాసే విధంగా అవకాశం కల్పిస్తామన్నారు. కులాలు, మతాల పేర్లతో హాస్టళ్లు, స్కూళ్ళు కాకుండా కామన్ హాస్టళ్లు, కామన్ విద్యా సంస్థలు నెలకొల్పుతామన్నారు. స్వామి వివేకనంద స్ఫూర్తిగా ఉక్కు నరాలు కలిగిన యువత ఈ దేశానికి అవసరమని, వజ్రాయుధం వంటి మనసు కలిగిన యువశక్తి సమాజానికి అవసరమని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ వృత్తి కళాశాలల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు, వెలివేట్ హబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే అన్ని విభాగాల్లో ఇప్పటికే గుర్తించిన లక్ష బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. సంవత్సరానికి పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఐటి, వౌలిక సదుపాయాల రంగం, విద్యుత్ తదితర రంగాల్లో ఉద్యోగాలను సృష్టిస్తామన్నారు.
ఇక ఆరోగ్య రంగానికొస్తే.. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగానికి కేటాయిస్తోన్న బడ్జెట్ కంటే జనసేన బడ్జెట్ దాదాపు రెండింతలు పెంచి కేటాయిస్తుందన్నారు. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామన్నారు. మండలానికొక మొబైల్ డయాలసిస్ సెంటర్‌ను, ప్రతీ మండలానికి 70 పడకలు ఆసుపత్రిని నెలకొల్పుతామన్నారు. చిరు వ్యాపారులకు రూ.5వేలు పెట్టుబడి అప్పు కల్పిస్తామన్నారు. పీసీఎఫ్‌ను రద్దు చేస్తామన్నారు.
కాపులకు 9వ షెడ్యూల్‌లో ద్వారా రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ చాలా సున్నితమైన విషయమని, ఎస్సీ, ఎస్టీలను కూర్చోబెట్టి సమస్యను పరిష్కరిస్తామన్నారు. రాయలసీమలో వెనుకబడిన ముస్లిం మైనార్టీల కోసం సజ్జార్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామన్నారు. డబ్బులెవరికీ ఊరికే రావు..మరి మీకెందుకు అని పవన్ కళ్యాణ్ చమత్కరిస్తూ బంగారం తాకట్టుకు యాభై పైసల వడ్డీకే కల్పిస్తామని, ఏడాది లోపు తీర్చేసేలా ఉంటే పావలా వడ్డీయే వసూలు చేసేలా చేస్తామన్నారు.
మత్య్సకారులకు ఫిషరీస్ డవలప్‌మెంట్ బ్యాంకు ఏర్పాటు చేస్తామన్నారు. మత్య్స వేట నిషేద సమయంలో 300 రోజుల ఉపాధి భృతి కల్పిస్తామని, తుపాన్లు వంటి సమయంలో వేటలేనపుడు రోజుకు రూ.500 చొప్పున ఇస్తామని, జనసేన అధికారంలోకిచ్చిన రెండేళ్ళలోనే అన్ని మత్య్సకార గ్రామాల్లో రక్షిత మంచినీటిని కల్పిస్తామన్నారు. మత్య్సకారులకు ఫిషింగ్ హార్బర్లలో ప్రత్యేక జెట్టీలు, డీప్‌సీ ఫిసింగ్‌కు ప్రత్యేక ఆధునిక మరబోట్లు ఒక ప్రత్యేక సంస్థ ద్వారా అందిస్తామన్నారు. ఆడపడుచులకు రక్షణకు కఠిన చట్టాలు తెస్తామని, ఆడబడుచులకు అండగా, భద్రత కలిగిన సమాజాన్ని ఇస్తామన్నారు. 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, పంచాయతీ ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు సైతం ప్రాధాన్యత ఇస్తామని, మహిళలకు ఉచిత గ్యాస్ పంపిణీ, సంక్రాంతితోపాటు ఏ పండగైనా ఉచితంగా చీరలు పంపిణీ చేస్తామన్నారు. మండలానికొక కళ్యాణ మండపం నిర్మిస్తామన్నారు. ఉద్యోగాలు చేసే మహిళల పిల్లల సంరక్షణకు ప్రభుత్వమే శిశు సంరక్షణా కేంద్రాలు నడుపుతుందన్నారు. రెల్లి కులానికి అండగా ఉంటామని, రెల్లి యువతకు రూ.50వేల వరకు వడ్డీ లేని రుణం కల్పిస్తామని, యాభై శాతం సబ్సిడీపై ఆటోలు ఇస్తామన్నారు.
యువతకు పెద్ద పీట వేస్తామని, జిల్లాకు మూడు చొప్పున ఉద్యోగావకాశాల జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాకు పది చొప్పున స్మార్ట్ సీటీలుగా అభివృద్ధి చేస్తామన్నారు. దీని ద్వారా యాభై వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. స్వామి వివేకానందుడు చెప్పినట్టు అసాధ్యంలోనే సాధ్యం వుందనే స్ఫూర్తితో ఏడాదిగా కసరత్తు చేసి ఈ మేనిఫేస్టోను రూపొందించామని పవన్ కళ్యాణ్ అన్నారు. రెండు మూడు రోజుల్లో పూర్తి ప్రతిని అందిస్తామన్నారు.
చిత్రాలు.. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో నిర్వహించిన సభలో మాట్లాడుతున్న పవన్‌కళ్యాణ్