రాష్ట్రీయం

తెలుగుదేశం పార్టీకి మాగుంట రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. అభిమానుల అభీష్టం మేరకు వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గురువారం ఒంగోలులో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఆ లేఖను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావుకు పంపించారు. తెలుగుదేశం జాతీయ కమిటీ ఉపాధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు లేఖ పంపించారు. తన శాసనమండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ శాసనమండలి చైర్మన్‌కు లేఖను పంపించినట్లు మాగుంట వెల్లడించారు. మాగుంట కుటుంబ శ్రేయోభిలాషులు, అభిమానులు, కార్యకర్తల అభీష్టం మేరకు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన వివరించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.