రాష్ట్రీయం

టీడీపీకి మరో షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలేశ్వరం: తెలుగుదేశం పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు గురువారం ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో ఆయన స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తనకు టిక్కెట్ కేటాయించకుండా వేరే వారికి ప్రత్తిపాడు శాసన సభ టిక్కెట్టును ప్రకటించడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల నుండి వచ్చిన తన కార్యకర్తలను, అభిమానులను చూసి భావోద్వేగానికి గురై కంట తడిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరుపుల మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనను ఎంతో అభిమానంగా చూసే వారని, ఆయన మరణానంతరం ఆయన కుమారుడు జగన్ తనను గుర్తించి 2014లో ప్రత్తిపాడు టిక్కెట్టు కేటాయించారన్నారు. వైసీపీ తరఫున పోటీచేసి, గెలుపొందిన తనకు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఈనేపధ్యంలో నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కార్యకర్తల అభీష్టం మేరకు తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకున్నానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మి నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తుంటే తనను ఆదమరచి, వేరే వారికి పార్టీ టిక్కెట్ కేటాయించడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. అందుచేతనే పార్టీ కార్యకర్తలందరితో సమాలోచన చేసి, వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నానని ఎమ్మెల్యే వరుపుల ప్రకటించారు. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, పార్టీకి తన రాజీనామా లేఖను పంపుతున్నట్టు వరుపుల తెలిపారు. అలాగే వైసీపీలో చేరేందుకు అధినాయకుడు జగన్‌తో మాట్లాడి తామంతా ఆ పార్టీకి వెళ్తున్నట్టు ప్రకటించారు. తన మనుమడైన డీసీసీబీ ఛైర్మన్ వరుపుల రాజాకు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇవ్వడంతో తనకు వెన్నుపోటు పొడిచిన తెలుగుదేశం పార్టీని, వరుపుల రాజాను ఓడించడమే లక్ష్యంగా నియోజకవర్గంలో కృ షి చేస్తానని భావోద్వేగంతో ప్రసంగించారు. ఏలేశ్వరం జడ్పీటీసీ సభ్యుడు జ్యోతుల పెదబాబు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి బుజ్జి, ప్రత్తిపాడు, రౌతులపూడి, శంఖవరం, ఏలేశ్వరం మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
చిత్రం.. కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వరుపుల