రాష్ట్రీయం

అశోక్ చుట్టూ ఉచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐటీగ్రిడ్స్ డేటా కుంభకోణంపై సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐటీగ్రిడ్స్ సీఈవో అశోక్ పోలీసులకు లొంగిపోకుండా పరారీలో ఉన్నాడు. తమ ఎదుట హాజరుకావాలని ఇప్పటికే సైబరాబాద్, సిట్ అధికారులు అతడికి నోటీసులు ఇచ్చారు. ఏ నోటీసుకు అతడు స్పందించింది లేదు. ఇప్పటి వరకూ అజ్ఞాతంలోనే ఉన్నారు. అశోక్ ఏపీ రాజధాని అమరావతిలో ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అక్కడి పోలీసుల సహకారంతో తలదాచుకున్నట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. హైకోర్టు సైతం పోలీసులకు సహకరించాలని అశోక్‌ను హెచ్చరించింది. అయినా పత్తాలేరు. ఇక సిట్ అధికారులు కోర్టు అనుమతితో అరెస్టు వారెంట్‌తో అశోక్‌ను అరెస్టు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 20న హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అశోక్‌కు సంబంధించిన నివేదిక సమర్పించనున్నారు. ముందుగా 14 సీఆర్పీసీ కింద శనివారం అరెస్టు వారెంట్ జారీ చేశారు. విచారణ కోసం పలుదఫాలుగా నోటీసులు ఇచ్చినా అశోక్ డుమ్మాకొట్టాడు. దీన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.