రాష్ట్రీయం

త్వరలో జాతీయ పార్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మార్చి 17: నిరాశవాద రాజకీయాల నుంచి ఉద్యమం వైపు మళ్ళించి, ప్రత్యేక పోరాటానికి దశ,దిశ చూపి, రాదనుకున్న తెలంగాణను తెచ్చి చూపటంలోక్రియాశీలక భూమిక పోషించిన పోరుగడ్డ కరీంనగర్ ప్రజలు దీవిస్తే దేశం తలరాత కూడా మారుస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. 17వ లోక్‌సభ సమరభేరికి అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఆదివారం నగర శివారులో శంఖారావం మోగించింది. ఈసభ ద్వారా పార్టీ శ్రేణులు, అభిమానులకు దిశా, నిర్దేశం చేసేందుకు పాల్గొన్న ఆయన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, అన్నీ అనుకూలిస్తే త్వరలోనే జాతీయ పార్టీ కూడా స్థాపించి, దేశ రాజకీయాల్లో బలమైన శక్తిగా మారుతామని స్పష్టం చేశారు. బిందువు, బిందువుకలిసి ఏరుగా మారినట్లు, ప్రాంతీయ పార్టీలన్నిటిని ఏకం చేసి, జాతీయ రాజకీయాల్లో పెనుమార్పులు తెచ్చేందుకు కూడా వెనుకాడబోమన్నారు. ఏడు దశాబ్దాల కాంగ్రెస్, భాజపాల పాలనలో దేశంలో కనీస వసతులు కూడా మృగ్యమయ్యాయని, దీనిని అధిగమించి దేశంలోని వనరులన్నీ సద్వినియోగం చేసుకునేలా అన్ని పార్టీలతో ఇప్పటికే చర్చించామని అన్నారు. ప్రధానంగా తాగు,సాగు నీరు కూడా దేశ ప్రజలకు అందించటంలో ఈ రెండు పార్టీలు ఘోరంగా వైఫల్యం చెందాయని, తద్వారా ప్రజలు తీవ్ర వెనుకబాటు తనాన్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా 70 వేల టీఎంసీల నీటి లభ్యత ఉన్నప్పటికీ, ఇప్పటీకీ కేవలం 40 వేల టీఎంసీలు మాత్రమే పాలకులు వినియోగంలోకి తెస్తున్నారని, విద్యుత్ వినియోగంలో కూడా పాలకులు ఘోరంగా వైఫల్యం చెందారని విమర్శించారు. కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకున్నా నాలుగున్నరేళ్ళలోరాష్ట్రంలో పలు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టగా, మరో ఆరుమాసాల్లో వాటి ఫలాలు అనుభవించబోతున్నామని అన్నారు. అన్ని వనరులున్న దేశంలో ఏడు దశాబ్దాలుగా పాలకులు దేశ ప్రజలకు అందించిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. పేలిపోయే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, కాలిపోయే మోటార్లు, రైతులకు విద్యుత్ షాక్‌లు మాత్రమే అందించారని ఎద్దేవా చేశారు. నాలుగేళ్ళలో ఒక్కసారైనా త్రీఫేస్ విద్యుత్ సరఫరా నిలిపేయలేదని, నాణ్యమైన విద్యుత్‌తో అధిక దిగుబడులు సాధించేందుకు నిరంతర కృషి చేస్తున్నది తెలంగాణ మాత్రమేనన్నారు. ఫలితంగా నాలుగేళ్ళలో రాష్ట్రం నందనవనంగా మారిందని, మరో ఆరు మాసాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిఅయితే, రాష్ట్రంలో నీటి ఊటలు కారనున్నాయన్నారు. దీంతోఅన్ని జలాశయాల్లో 365రోజుల పాటు నీరు నిల్వ ఉంటుందని, ఇదే విధానం దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు మరోసారి జిల్లా ప్రజలు వీర తిలకం దిద్ది, యుద్ధానికి పంపాలని కోరారు. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తేనే కాంగ్రెస్, బీజేపిల కుయుక్తుల ఆట కట్టించవచ్చని, దేశ ఉజ్వల భవిష్యత్ కోసం పెనుమార్పులు రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈసభలో రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు,రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మికాంతారావు, తెరాస సెక్రటరీ జనరల్ కే.కేశవరావు, తెరాస పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ ఆర్‌తో పాటు ఎమ్మెల్సీలు పల్లారాజేశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్, పాతూరి సుధాకర్‌రెడ్డి, నారదాసు లక్ష్మన్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమతో పాటు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, పలు కార్పొరేషన్‌ల చైర్మన్‌లు పాల్గొన్నారు.

చిత్రాలు..సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ *(ఇన్‌సెట్‌లో ) పాల్గొన్న ప్రజానీకం