రాష్ట్రీయం

ప్రక్షాళన జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: టీ.కాంగ్రెస్ ప్రక్షాళన జరిగిన తర్వాతే గాంధీ భవన్‌లో అడుగు పెడతానని ఆ పార్టీ నాయకుడు సర్వే సత్యనారాయణ అన్నారు. టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నల్లగొండ లోక్‌సభ నుంచి పోటీ చేస్తే తాను ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని సర్వే సోమవారం విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర నాయకత్వం మార్పు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. అధిష్ఠానం వెంటనే దృష్టి సారించి, రాష్ట్ర పార్టీని ప్రక్షాళన చేయకపోతే రాష్ట్రంలో పార్టీ మరింత నష్టపోతుందని ఆయన తెలిపారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడనని సర్వే తేల్చిచెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు కొంత మంది పార్టీని వీడి వెళుతుంటే, వారు పార్టీ ఫిరాయించకుండా నిరోధించాల్సిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధిష్ఠానం వద్ద లోక్‌సభ సీటు కోసం ప్రయత్నాలు చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇదిలాఉండగా మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్న టీ.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సోమవారం సర్వే సత్యనారాయణ నివాసానికి వెళ్ళి చర్చలు జరిపారు. లోక్‌సభ ఎన్నికల్లో తనకు సంపూర్ణ సహకారం అందించాల్సిందిగా ఆయన కోరారు.