రాష్ట్రీయం

రిటర్నింగ్ అధికారులుగా ఐఏఎస్‌ల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు 17 మంది ఐఏఎస్ అధికారులను రిటర్నింగ్ అధికారులుగా కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించింది. ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, పెద్దపల్లి నియోజకవర్గానికి పెద్దపల్లి కలెక్టర్, కరీంనగర్ నియోజకవర్గానికి కరీంనగర్ కలెక్టర్, నిజామాబాద్ నియోజకవర్గానికి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారులుగా నియామకం అయ్యారు. జహీరాబాద్ నియోజకవర్గానికి సంగారెడ్డి కలెక్టర్, మెదక్ నియోజకవర్గానికి మెదక్ జిల్లా కలెక్టర్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్, సికింద్రాబాద్ నియోజకవర్గానికి హైదరాబాద్ జాయింట్ కలెక్టర్, హైదరాబాద్ నియోజకవర్గానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్, చేవెళ్ల నియోజకవర్గానికి రంగారెడ్డి కలెక్టర్ రిటర్నింగ్ అధికారులుగా నియామకం అయ్యారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి మహబూబ్‌నగర్ కలెక్టర్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గానికి నాగర్‌కర్నూల్ కలెక్టర్ నల్లగొండ నియోజకవర్గానికి నల్లగొండ కలెక్టర్, భువనగిరి నియోజకవర్గానికి యాదాద్రి భువనగరి కలెక్టర్, వరంగల్ నియోజకవర్గానికి వరంగల్ (అర్బన్) కలెక్టర్, మహబూబాబాద్ నియోజకవర్గానికి మహబూబాబాద్ కలెక్టర్, ఖమ్మం నియోజకవర్గానికి ఖమ్మం కలెక్టర్ రిటర్నింగ్ అధికారులుగా నియామకం అయ్యారు.