రాష్ట్రీయం

వలసల పర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కూడా టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి బుధవారం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును కలిసి ఆ పార్టీలో చేరడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. అవసరమైతే ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ పార్టీతోపాటు పదవికి కూడా రాజీనామా చేసి, టీఆర్‌ఎస్ తరఫున తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికైనా సిద్ధమేనని హర్షవర్ధన్‌రెడ్డి ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరబోతున్న ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్, సబితా ఇంద్రారెడ్డి, కందాళ ఉపేందర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వర్‌రావు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతంగా అభివృద్ధి చెందిందని హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తారన్న నమ్మకంతోనే తనను ఎమ్మెల్యేగా గెలిపించారని హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిగా సానుకూలంగా స్పందించారన్నారు. సీఎంపై నమ్మకం, నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు, పార్టీ కార్యకర్తలతో చర్చించాకే టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు హర్షవర్ధన్‌రెడ్డి ప్రకటించారు.

చిత్రం.. కేటీఆర్‌ను కలిసిన కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి