రాష్ట్రీయం

మైనారిటీల సంక్షేమమే టీఆర్‌ఎస్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్(కంఠేశ్వర్), మార్చి 20: టీఆర్‌ఎస్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. బుధవారం మైనారిటీ నాయకులు, టీడీపీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతదేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని కవిత ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో ఆరితేరితే, బీజేపీ ప్రజలను మోసగించడంలో రాటుదేలాయన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్ల కాలంలో పేదలకు అనేక సంక్షేమ పథాకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని అన్నారు. ముఖ్యంగా మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నామని, షాదీముబారక్ పథకం ద్వారా పేదింటి ముస్లిం యువతుల పెళ్లికి మొదట 50వేలు, మలివిడత 75వేల రూపాయలు, ప్రస్తుతం లక్షా 116రూపాయలను ఇవ్వడం జరుగుతోందన్నారు. జిల్లాలో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పడం జరిగిందని, నగరంలోనే 8 మహిళా రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో రంజాన్ పండుగను ఎవరూ పట్టించుకోలేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాకే మైనారిటీలకు నూతన వస్త్రాలతో పాటు అధికారికంగా విందు కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. ఇన్ని పథకాలు అమలు చేస్తున్నందునే ముస్లిం మైనారిటీ సోదరులు టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అండగా ఉన్నారని, ఈ ఉత్సాహంతో రాబోయే రోజుల్లో మైనారిటీల సంక్షేమానికి మరింతగా కృషి చేస్తామన్నారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ, గత ఐదేళ్ల కాలంలో నగరాభివృద్ధికి 900కోట్ల రూపాయలను తీసుకువచ్చానని, దాంతో రెండోసారి తనను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారని, రాబోయే రోజుల్లో నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతానని అన్నారు. మైనారిటీలకు షాదీముబారక్ ద్వారా వందలాది చెక్కులను అందించి వారి పెళ్లిలకు చేయూతనందించానన్నారు. టీడీపీ నాయకులు బాలకిషన్, పుప్పాల రవి, రాజమల్లు, కాంగ్రెస్ నాయకులు ఫయాజుద్దీన్ తదితరులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరగా, వారికి ఎం.పీ కవిత గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
చిత్రం.. మైనారిటీలు పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంపీ కవిత