రాష్ట్రీయం

అభ్యర్థుల ప్రకటన నేడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: పార్లమెంట్ ఎన్నికలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎవరన్న సస్పెన్స్ మరికొన్ని గంటల్లో వీడబోతుంది. హైదరాబాద్ మినహా మిగిలిన 16 ఎంపీ స్థానాలకు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం ప్రకటించబోతున్నారు. ఒకరిద్దరు సిట్టింగ్ ఎంపీలకు ఈ సారి టికెట్లు ఇవ్వడం లేదని ఇప్పటికే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్
ప్రకటించడంతో వారు ఎవరన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు తమకు టికెట్ దక్కుతుందో? లేదో?నని సిట్టింగ్‌ల్లో సైతం టెన్షన్ నెలకొంది. టీఆర్‌ఎస్ అధిష్ఠానం విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ముగ్గురు సిట్టింగ్‌లకు టికెట్ నిరాకరించే అవకాశం ఉంది. ఈ వర్గాల సమాచారానికి మరింత బలం చేకూర్చే విధంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం హైదరాబాద్‌లో మహబూబాబాద్, మహబూబ్‌నగర్, పెద్దపల్లి నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. టికెట్ ఎవరికిచ్చినా పార్టీ విజయానికి కృషి చేస్తామని ఆ జిల్లా నేతలు అధినేతకు హామీ ఇచ్చారు. ఈ మూడు నియోజకవర్గాలకు చెందిన నాయకులతోనే సీఎం కేసీఆర్ సమావేశం కావడంలో వెనుకనున్న ఆంతర్యం వెనుక సిట్టింగ్‌ల స్థానాలకు అభ్యర్థుల మార్పునకు సంకేతంగా భావిస్తున్నారు. టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం ప్రకారం ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్ ముగ్గురు సిట్టింగ్‌లకు టికెట్ దక్కడం కష్టమేనని తెలిసింది. ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారామ్ నాయక్‌కు టికెట్ ఇవ్వడం లేదన్నది పార్టీ వర్గాల్లో మొదటి నుంచి వినిపిస్తున్నదే. తాజాగా మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డికి బదులుగా ఇక్కడి నుంచి ఎంఎస్‌ఎన్ ఫార్పా కంపెనీ అధినేత మనె్న సత్యనారాయణరెడ్డికి టికెట్ దక్కే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అలాగే చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశించి కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన కార్తీక్‌రెడ్డికి కూడా టికెట్ ఇవ్వడం లేదని తాజా సమాచారం. ఇక్కడి నుంచి ఫౌల్ట్రీ పరిశ్రమ అధినేత రంజిత్‌రెడ్డికి దాదాపు టికెట్ ఖరారు అయినట్టేనని సమాచారం. అలాగే మల్కాజ్‌గిరి నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి, పెద్దపల్లి నుంచి మాజీ ఎంపి వివేక్‌కు టికెట్లు ఖాయమైనట్టు తెలిసింది.