రాష్ట్రీయం

వాడిన ‘పూవు’ వికసించేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి: డాక్టర్ అక్కినేని నాగేశ్వర్‌రావు, మహానటి సావిత్రి నటించిన మాంగల్యబలం సినిమాలో ప్రేక్షకాదరణ పొందిన ‘వాడిన పూలే వికసించెనే’ అనే సుమధురమైన గీతం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ శ్రేణులు తలచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 1990లో బీజేపీ అంటే సామాన్యుడికి కూడా తెలియదు. రామమందిరం, బాబర్ మసీదు వివాదంపై తేల్చుకోవడానికి ఆ పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ కశ్మీరు నుండి కన్యాకుమారి వరకు చేపట్టిన అయోధ్య రథయాత్ర ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో సైతం బీజేపీకి విస్తృత ప్రచారం లభించింది. అనంతరం వచ్చిన ఎన్నికల్లో బీజేపీ నాయకులు పోటీ చేయడం, హిందుత్వ భావజాలం పెరిగిపోవడంతో ఆ పార్టీకి కార్యకర్తలు, అభిమానాలు పెరుగుతూ వచ్చారు. 1991 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మొదటిసారిగా మెదక్ పార్లమెంటు నుంచి పటన్‌చెరుకు చెందిన డాక్టర్ అల్లాని కిషన్‌రావు పోటీ చేసి నియోజకవర్గం జనంలోకి బీజేపీ పేరును తీసుకువెళ్లారు. అయోధ్య కరసేవలో తన ఇమేజ్‌ను చాటుకున్న పక్కా హిందుత్వవాది అయిన ఆలె నరేంద్ర మెదక్ పార్లమెంటు స్థానంపై దృష్టి సారించారు. ఈ మేరకు 1994 సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి చెందినా ప్రజల్లో మాత్రం మంచి సానుభూతిని పెంచుకున్నారు. ఓటమితో కృంగిపోని నరేంద్ర నియోజకవర్గంలో బీజేపీని విస్తృత పర్చేందుకు శాయశక్తుల కృషిచేసారు. 1999 ఎన్నికల సందర్భంగా టీడీపీ, బీజేపీల మద్య పొత్తు కుదరడంతో మెదక్ పార్లమెంటు స్థానం, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించారు. హిందుత్వవాదం, టీడీపీ శ్రేణుల బలంతో జనంలోకి చొచ్చుకువెళ్లిన ఆలే నరేంద్ర ఘనవిజయం సాధించి లోక్‌సభలో కాలుమోపారు.
అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమానికి తెరలేవడం, నరేంద్ర సైతం తెలంగాణ సాధన సమితి పార్టీని స్థాపించడం, 2004 ఎన్నికల నాటికి ఆ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడం చకచకా జరిగిపోయాయి. 2004 ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా మరోమారు ఇదే నియోజకవర్గం నుండి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్ర ఘనవిజయం సాధించి యూపీఏ ప్రభుత్వంలో మంత్రి పదవిని దక్కించుకున్నారు. 1999 ఎన్నికల వరకు పటిష్టంగా ఉన్న భారతీయ జనతా పార్టీ అనంతరం కోలుకోలేకపోగా పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారింది. 2009 ఎన్నికల నాటికి ముందు చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన మెదక్ పార్లమెంటు నియోజకవర్గ నైసర్జిక స్వరూపం మారిపోవడంతో పార్టీ ఎదుగుదలకు అవరోధంగా మారిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 1999, 2004 ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, సంగారెడ్డి, మెదక్‌లతోపాటు నిజామామాద్ జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలు కలిసివుండేవి. డీలిమిటేషన్‌తో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుండి జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ విడిపోగా, సంగారెడ్డి, పటన్‌చెరు, మెదక్, నర్సాపూర్, గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేటలతో పార్లమెంటు స్థానంగా అవతరించింది. తెలంగాణ భావజాలం అధికంగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లు మెదక్ పార్లమెంటు స్థానంలో ఉండటం కూడా కమలానికి కొరకరాని కొయ్యగా మారింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభమై రెండు రోజులు గడచినా ఈ నియోజకవర్గం నుండి పోటీచేసే అభ్యర్థి పేరును ఇప్పటికీ ఖరారు చేయలేదు. ఎవరినో ఒక అభ్యర్థిని బరిలోకి దింపినా అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ముందు ఏ మేరకు నిలదొక్కుకుని గట్టిపోటీని ఇస్తారో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.