రాష్ట్రీయం

పెళ్లికొడుకైన భద్రాద్రి రామయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్: భద్రాద్రి రామయ్య పెళ్లి కొడుకుగా ముస్తాబయ్యాడు. వసంతోత్సవ వేళ రామయ్యపై శాస్త్రోక్తంగా అర్చకులు వసంతం చల్లడంతో రామయ్య పెళ్లి కొడుకయ్యాడు. ఏప్రిల్ 14న భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామికి అంగరంగ వైభవంగా కల్యాణం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హోలీ పౌర్ణమిని పురస్కరించుకొని స్వామివారికి గురువారం సహస్రధారలతో ప్రత్యేక స్నపనం నిర్వహించారు. అనంతరం అందంగా అలంకరించిన స్వామిని ఉయ్యాల్లో ఆశీనులను చేయించి డోలోత్సవం జరిపించారు. హోలీ సందర్భంగా వసంతోత్సవాన్ని నిర్వహించగా ముందుగా ప్రధాన ఆలయంలోని ధ్రువమూర్తులకు, ఆంజనేయస్వామికి, లక్ష్మీతాయారు అమ్మవారికి వసంతాన్ని చల్లారు. అలాగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి సంబంధించి ఎంతో విశిష్టత గల తలంబ్రాల తయారీ కార్యక్రమానికి సైతం శ్రీకారం చుట్టారు. తొలిరోజున 20క్వింటాళ్ల తలంబ్రాలను సిద్ధం చేయగా మొత్తంగా ఈ ఏడాది 150 క్వింటాళ్ల తలంబ్రాలు తయారు చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
చిత్రం.. డోలోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు